'గౌతమ్' రీ-ఎంట్రీ
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్. సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో తెరమరుగయిపోయారు. కానీ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. ఇన్నాళ్లు నటనకు సంభందించిన శిక్షన తీసుకున్న గౌతమ్ త్వరలోనే రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నాడట.
'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం' లాంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే కథాచర్చలు పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే లాంఛనంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషన జరుగుతోంది. ఈ రీ-ఎంట్రీతో తన కెరీర్ ఊపందుకుంటుందని గౌతమ్ ఆశిస్తున్నాడు.
More from Filmibeat
gautham brahmanandam chandrasekhar yeleti prayanam suchitra chandrabose pallakilo pellikoothuru rathi గౌతమ్ బ్రహ్మానందం సుచిత్రా చంద్రబోస్ చంద్రశేఖర్ ఏలేటి మనోజ్ పల్లకిలో పెళ్లికూతురు


Click it and Unblock the Notifications











