విలన్ సోనూ సూద్ ఇంటిపై ఐటీ రైడ్
సాధారణంగా ఆదాయపన్ను అధికారులు నిర్వహించే దాడులు మాదిరి గాకుండా సర్వే సందర్భంగా వ్యక్తుల ఆదాయ పన్ను రిటర్న్స్ వివరాలతో జమా ఖర్చుల పత్రాలు, రికార్డులు సరిచూస్తారని వివరించాయి. ఇద్దరు సినీ ప్రముఖుల వివరాల సర్వే సుమారు 17 - 19 గంటల సమయం చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఐటి అధికారులకు నటులు పూర్తిగా సహకరించినందున ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని సమాచారం.
రంగీలా తో చిత్ర రంగ ప్రవేశం చేసిన సోనూ సూద్..బాలీవుడ్ లో కంటే తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. ఆయన రీసెంట్ గా అల్లు అర్జున్ జులాయి లో బిట్టు పాత్ర బాగా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ హిందీ రీమేక్ జంజీర్ లో షేర్ ఖాన్ పాత్రను చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మంచు మనోజ్ ..ఊ కొడతారా ఉలిక్కిపడరారా లో కూడా పణీధ్ర భూపతిగా కనిపించి అలరించారు. తనదైన నటనతో పెద్ద హీరోల చిత్రాలలో విలన్ గా దూసుకుపుతున్నారు.


Click it and Unblock the Notifications












