తప్పేమీ కాదు-మంచి అనుభవం: తాప్సీ
చాలా మంది హీరోయిన్లు సెకండ్ హీరోయిన్ లేదా మూడో హీరోయిన్ గా నటించడానికి అంతగా ఇష్టపడరు. తప్పని పరిస్థితులు, పోద్ద బ్యానర్, పెద్ద దర్శకులు, పెద్ద హీరోలు తప్పిస్తే ఒప్పుకోరు. అలా నటిస్తే తమకు సరైన పేరు రాదనేది కొందరి వాదన. అయితే తాప్సీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించటం మంచి అనుభవమని అంటోంది. ఇద్దరు హీరోయిన్ల చిత్రాల్లో నటించటం తాను తప్పుగా భావించటం లేదని, తన పాత్ర ఏంటనేది మాత్రమే చూస్తానని..కొందరైతే ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అని అంటుంటారని, తనకు అటువంటి బేధాలు లేవని చెబుతోంది.
ఇప్పటి వరకూ తాప్సీకి వచ్చిన అవకాశాలన్ని చాలా వరకు ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలే. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న 'మొగుడు' చిత్రంలో ఈ సొట్టబుగ్గల సుందరి సోలోగా వస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తాప్సీ అవకాశాలు చేజిక్కించుకుంటోంది. త్వరలోనే ఢిల్లీభామ డేవిడ్ దావన్ రూపొందించనున్న చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. మరి తాప్సీ అందాల ప్రయాణం ఏ మేరకు సక్సెస్ అవుతుందో? నెంబర్ స్థానానికి చేరుతుందో? లేదో? కాలమే నిర్నయించాలి.


Click it and Unblock the Notifications











