twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్రోకు థాంక్స్ చెప్పిన హీరో ప్రభాస్... చంద్రయాన్ 2కు, బాహుబలికి లింకు ఏంటి?

    |

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రుడిపై పరిశోధనల కోసం పంపిన చంద్రయాన్‌ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న చంద్రుడిపై వాలనుంది. ఇస్రో పంపిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌)కు బాహుబలి అని పిలుస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు. హలో డార్లింగ్స్.. ఇది మన భారతీయులు గర్వపడే రోజు. ఇస్రో చంద్రయాన్ 2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. చంద్రయాన్ 2ను పంపిన రాకెట్‌ను బాహుబలి అని పిలుస్తుండటంపై మా చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది, ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఈ ప్రయోగం వెనక ఎన్నో సంవత్సరాల శ్రమ దాగి ఉంది, ఇది మన దేశానికి మరింత పవర్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రభాస్ వ్యాఖ్యానించారు.

    It is a further honor for the entire Baahubali Team: Prabhas on Chandrayaan 2 named after his film Baahubali

    చంద్రయాన్‌ 2 ఉపగ్రహంలో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు పరికరాలు ఉంటాయి. వీటి మొత్తం బరువు 3447 కిలోలు. ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తే... ల్యాండర్‌ ద్వారా రోవర్ చంద్రుడిపై దిగా అక్కడ నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.

    ప్రభాస్ సినిమాల విషయానికొస్తే... ఇండియా మొత్తం 2019లో ఎదురు చూస్తున్న అతిపెద్ద మూవీ 'సాహో'. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలో ఓ రేంజిలో ఉన్నాయి. అందుకు తగిన విధంగానే రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ బిగ్ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల రిలీజ్ డేట్ ఆగస్టు 30కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని భావించామని, పోస్ట్ ప్రొడక్షన్ మరింత క్వాలిటీగా రావాలనే ఉద్దేశ్యంతో రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు తెలిపారు.

    English summary
    "Hello Darlings! It is a proud day for all of us Indians as ISRO's Chandrayaan-2 took flight today. It is a further honor for the entire Baahubali Team with the rocket being regarded as Baahubali for its magnum opus scale, years of hardwork in the making & first of its kind capacity to carry 300 tonnes. 🙌🏻 More Power to India." Prabhas tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X