నవంబర్ 12: కళ్యాణ్ రామ్ కీ రామ్ చరణ్ తేజకీ మధ్య వార్
కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం కత్తిని నవంబర్ 12న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున రామ్ చరణ్ కూడా తన తాజా చిత్రం ఆరెంజ్ ని విడుదల చేయాటనికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అవ్వటానికి ప్రిపేర్ అవుతూంటే ఇండస్ట్రీ అంతా ఆసక్తి గా చూస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమాని అతనే తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై మల్లి దర్శకత్వంలో నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చెల్లెలు సెంటిమెంట్ తో ఫన్ తో కలగలపి నడవనుందని సమాచారం.
మరో ప్రక్క మగధీర వంటివిజయం తర్వాత రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో ఆరెంజ్ చిత్రం చేసారు. నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ రేంజి లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్నారు. హారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇక జెనీలియా హీరోయన్ గా చేస్తోంది. ఆమెతో పాటు షాజన్ పదమ్ సీ, సంచితా షెట్టి లీడ్ రోల్స్ చేస్తున్నారు. షాజన్ పదమ్ సీ ఈ చిత్రంలో టీనేజ్ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తాను అని చెప్తోంది. సినిమా సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది.


Click it and Unblock the Notifications











