అన్నయ్యతో కలిసి కష్టమే.... పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాంటిది మరి!
పవన్ కళ్యాణ్ అలా అనడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి.
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ అభిమానులు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు దూరం అయిన తర్వాత ఈ విషయం మరుగున పడిపోయింది.
చిరంజీవి 150వ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం, ఆ సినిమా భారీ విజయం సాధించడంతో....కళా బంధు టి సుబ్బిరామిరెడ్డి చిరంజీవిని సన్మానించి ఓ సంచలన ప్రకటన చేసారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి సినిమా తీస్తానని ప్రకటించారు.
సుబ్బిరామిరెడ్డి ఆ ప్రకటన చేసినప్పటి నుండి.... మెగా అభిమానుల్లో కొత్త ఆశలు ఈ మెగా కాంబినేషన్ మీద మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం యూఎస్ఏ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కు అక్కడ కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురైంది.

ఆశలు ఆవిరయ్యాయి
మీరు మీ అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నారా అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... నా దగ్గరకు అలాంటి ప్రస్తావన గానీ, ప్రపోజల్ కానీ ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ అలా అనడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి.

ఉన్న పరిస్థితుల్లో కష్టమే
అన్నయ్య చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దగ్గరవుతూ పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి చేయడం కష్టమే అనేది చాలా మంది వాదన.

పవన్ గురించి అడగ్గానే చిరాగ్గా స్పందిచిన మెగాస్టార్



Click it and Unblock the Notifications











