బికినీలు వేయడం నేర్పిస్తానంటున్న బిపాసా
రెండు పీలికల బికినీ ధరించి బాలీవుడ్ తెరపై అందాలు ఆరబోసి కుర్రకారుకు రాత్రుళ్లు నిద్ర లేకుండా చేయడం హాట్ బేబీ బిపాసాకు కొత్తేమీ కాదు. మరి ఆ రేంజ్ లో ఉంటాయి ఆమె అందాలు. తాజాగా ఈ భామ తనలాగా సెక్సీగా బాడీని తయారు చేసుకోవడం ఎలా? అనే విషయం నేర్పించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఓ ఫిట్‌నెస్ డీవీడీని విడుదల చేసిన బిపాసా...త్వరలో మరో డీవీడీని విడుదల చేస్తోంది. దానిపేరు 'బీచ్ బాడీ వర్కౌట్'
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...స్విమ్ సూట్ వేసుకోవడం చాలా ఈజీ, కానీ టూపీస్ బికిని వేయడం చాలా కష్టం. ఎందుకంటే అది వేయాలంటే మంచి శరీర సౌష్ఠవం, సెక్సీ పిగర్ కావాలి. కాని చాలా మంది అమ్మాయిల శరీరాలు అందుకు తగిన విధంగా లేదు. తన డీవీడీ ద్వారా శరీరాన్ని అందంగా, బికినీకి సరిపోయే విధంగా ఎలా మలుచుకోవచ్చో అనే విషయం నేర్చుకోవచ్చు అంటోంది.
బిపాసా మాటలను బట్టి ఈ డీవీడీలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసినట్లు స్పష్టం అవుతోంది. అవి ఏరేంజ్లో ఉంటాయో ఆ డీవీడీ విడుదలైతేగానీ తెలీదు.


Click it and Unblock the Notifications











