అత్యంత వేగవంతంగా డబ్బింగ్ లో మహేష్ ‘బిజినెస్ మాన్’..!?
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న 'ది బిజినెస్ మ్యాన్" చిత్రం దూకుడు తర్వాత రానున్న సినిమా కావడంతో ఇప్పటికే మంచి బిజినెస్ చేస్తోంది ఇండస్ట్రీలో. సంక్రాంతికి విడుదలయ్యే బిజినెస్ మ్యాన్ చిత్రం మహేష్ కెరీర్‌లోనే అత్యంత ఫాస్ట్‌గా చిత్రీకరించబడుతోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా నిర్మాతలు రెండు నెలల ముందుగానే అభిమానులకు గిఫ్ట్‌గా అందించాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ ప్రొడక్షన్ వర్క్ కు రెడీ అవుతోన్న ఈ మూవీని 11వ తేదీ జనవరి 2012న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు త్వరితగతిన సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం గోవాలో క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. నవంబర్ లో స్పైన్ లోని వివిధ ప్రదేశాల్లో పాటల చిత్రీకరణకు ప్లాన్ చేసారు. దూకుడు పెద్ద హిట్ కావడం తో 'పూరీ" బాధ్యత మరింత పెరిగింది. పూరీకి కూడా ఇటీవల పెద్ద హిట్స్ లేక పోవడం తో కసిగా ఈ చిత్రాన్ని తీస్తున్నాడని అంటున్నారు. బిజినెస్ పరం గా కూడా ఈ చిత్రానికి భారీ రేటు పలుకుతోందట. 'మహేష్"రేంజ్ ఈ సినిమా తో పెరుగుతోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. తాజా సమాచారం. కాగా ఇదే నెలలో 'దూకుడు" చిత్రం అర్థ శతదినోత్సవ వేడుకలు సైతం విజయవాడ నగరంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిపించాలని చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











