నిన్న పవన్... నేడు కమల్ హాసన్!
సినిమాల్లో హీరో హీరోయిన్లు వాడే ట్రెండీ ఫ్యాషన్స్ సాధారణ జనాల్లోకి ఇట్టే చొచ్చుకు పోతాయి. అందుకే కాస్టూమ్స్‌పై చాలా శ్రద్ధ పెడుతుంటారు. కొన్ని సార్లు హాలీవుడ్, బాలీవుడ్ స్టయిల్స్‌ను మన తెలుగు హీరోలు ఫాలో కావడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. 2006లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'ఫనా'చిత్రం మెడకు తుండుగుడ్డ లాంటిది కట్టుకునే ఫ్యాషన్ చాలా పాపులర్ అయింది. వాస్తవానికి ఆ స్టయిల్ పాత సినిమాల్లోనే ఉండేది. అమీర్ ఖాన్ దానికి మళ్లీ కొత్తలుక్ తెచ్చి మళ్లీ పాపులర్ చేశాడు.
ఆప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో ఆ ట్రెండ్ ఓ ఫ్యాషన్‌గా మారి పోయింది. ఇటీవల విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ స్టయిల్‌ను అనుసరించాడు. 'ఆకాశం అమ్మాయి అయితే' పాటలో పవన్ మనకు ఆ విధంగా కనిపిస్తాడు. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న విశ్వరూపం చిత్రంలోనూ ఓ సన్నివేశంలో ఆ స్టయిల్ ఉపయోగించడం చర్చనీయాంశం అయింది.
'విశ్వరూపం' కమల్ హాసన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. దేశ చిత్రంలోనే తొలిసారిగా 150 కోట్లు భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ టెర్రరిజం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో కమల్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒక దాంట్లో సాంప్రదాయ బద్దమైన క్లాసికల్ డాన్సర్‌గా, మరొక పాత్రలో సాహసాలు చేసే వ్యక్తిగా దర్శనం ఇవ్వనున్నారు. 'దశావతారం' చిత్రం తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న భారీ చిత్రం ఇదే. ఈచిత్రానికి దర్శకుడు కూడా అతడే.
పవన్ కళ్యాణ్ విషయానికొస్తే...'గబ్బర్ సింగ్' ఆల్ టైం రికార్డు హిట్‌తో మంచి జోష్ మీద ఉన్న పవర్ స్టార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి రెడీ అవుతున్నారు. జూన్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.


Click it and Unblock the Notifications











