ప్రతి ఒక్కరూ ప్రేమ పేరుతో వేధిస్తున్నారంటున్న తార
స్నేహితులు, మీడియా, సినీరంగానికి చెందిన స్నిహితులు, ఇలా వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రేమ పేరుతో వేధిస్తున్నారని నటి ఉదయతార వాపోతోంది. పేరు కొత్తగా ఉంది ఈవిడ ఎక్కడి నుంచి ఊడి పడిందని అనుకుంటున్నారా?. తన తెలుగులో ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదుగానీ, తమిళ కన్నడ చిత్రాల్లో...బాగానే రాణిస్తోంది. ఈ భామ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియా నుంచి సన్నిహితుల వరకు ఎవరు తారసపడినా ఒకటే ప్రశ్న అడుగుతున్నారని తెలిపారు.
మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమిస్తే ఎవరా ప్రేమికుడు అంటూ ఆరా తీస్తున్నారని, మీడియా వారైతే మొదట ఏయే చిత్రాల్లో నటిస్తున్నారు? ఎలాంటి పాత్రలు చేస్తున్నారు అంటూ మొదలుపెట్టి చివరకు ప్రేమ వద్దకు వచ్చి ఆగుతున్నారని చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి, ఒక రకంగా వీటిని నేను విధింపులుగా భావిస్తున్నాను. నటి అయినంత మాత్రాన కచ్చితంగా ప్రేమించాలని నిబంధన ఏమైనా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఉదయ తార తమిళంలో శివ పూజయిల్ కరడి, బ్రహ్మపుత్ర, కన్నడంలో మరో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











