నా చిరాకల కోరిక తీరింది: రంభ
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందిన తెలుగమ్మాయి రంభ వివాహం నిన్న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. కెనడాకు చెందిన మ్యాజిక్ ఫుడ్స్ అధినేత ఇంద్రకుమార్ ను వివాహం చేసుకున్న ఈమె నేడు చెన్నైలో ఏర్పాటుచేసిన భారీ రిసెప్షన్ కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆమెను కలిసిన మీడియా ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయగా ఆమె ఎంతో సంతోషంగా తన పెళ్లి ముచ్చట్లను పంచుకున్నారు.
నా పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇక నా పెళ్లి తిరుమలలో ఆ ఏడుకొండల వాడి పాదాల వద్ద జరగడం నాకు అమితమయిన ఆనందాన్ని మిగిల్చింది. నేను నిత్యం కొలిచే ఆ తిరుమలేసుడి సన్నిధిలోనే నా పెళ్లి జరగాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఆయన నా కోరికను తీర్చి తన సన్నిధిలోనే నా పెళ్లి జరిగేలా చేసింనందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఇక నేను, ఇంద్ర బాగుండాలని ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరికీ మరో సారి నా ధన్యవాదాలు అని చెప్పి ముగించేసిందీ కొత్త పెళ్లికూతురు.


Click it and Unblock the Notifications











