నేనూ.. నా కొడుకూ ఒకే అమ్మాయితోనా?: నాగార్జున
నేను, నా కొడుకు నాగచైతన్య ఒకే అమ్మాయి అనూష్కతో సంభంధం పెడుతూ వార్తలు రాస్తున్నారు. అది చాలా నాస్టిగా ఉంది అంటున్నారు నాగార్జున. అది నాస్టి జర్నలిజం అంటున్నారు ఆయన. అలాగే సరదాగా ఏదైనా అనుకున్నంతసేపూ బాగానే ఉంటుంది కానీ ఇలాంటి రాతలు రాస్తేనే ఒళ్లు మండుతుంది అన్నారు. అదే నన్ను చాలా అప్ సెట్ చేసే విషయం. ఇలాంటివి నేను ఇష్టపడను అన్నారు.అయినా ఇలా ప్రతీసారి రియాక్టు అవటం నా డిగ్నటికి భంగమైన వ్యవహారం. ప్రతీసారి ఏదో ఒక గాసిప్ వస్తూంటుంది. వాటిని గురించి మాట్లాడుకోము.నేను ఇప్పుడు ఫిప్టీ ప్లస్.ఈ వయస్సులో నేను వీటిని పట్టించుకుని భాధపడాల్సిన పనిలేదు. నేను యువకుడుగా పాతికేళ్లవయస్సులో ఉన్నప్పుడు ఇలాంటివి నామీద రానేలేదు. ఇక ఇంట్లో ఏ భారతీయ కుటుంబం ఇలాంటి విషయాల ప్రస్దావన తెస్తుందని అనుకోను.మా అబ్బాయికీ ఇదే విషయం చెప్పాను. నువ్వు నటుడు కావాలనుకున్నప్పుడు...ఇలాంటివి తప్పకుండా వస్తాయి. పట్టించుకోకూడదు. ఇంకెప్పుడూ ఈ విషయం నా వద్ద ఎత్తకు..నీవు ఎంత పాపులర్ అయితే అంతలా రూమర్స్ నిన్ను చుట్టముడతాయి. అన్నాను సీరియస్ గా అన్నారు నాగార్జున. ప్రస్తుతం ఆయన ఢమురకం చిత్రం చేస్తున్నారు.
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











