మహేష్‌బాబుతో చేయటం అంటే మాటలు కాదు
నిన్న విడుదలైన మహేష్ "ఖలేజా" చిత్రంలో అనూష్క..ఐరెన్ లెగ్ లేడీగా కామిడీని బాగా పండించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆ పాత్ర చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందని అనూష్క చెప్తోంది. ఆమె మాటల్లోనే...ఖలేజాలో నా పాత్ర కథకు కీలకమైనది. హీరోయిన్ గా నన్ను మరో మెట్టుపైన నిలబెట్టే సినిమా అది. ఇక మహేష్ స్టారే కాదు...చక్కని టైమింగ్ ఉన్న నటుడు. ఆయన టైమింగ్ ని ఫాలో అవుతూ ఎక్సప్రెషన్స్ ఇస్తూ సీన్ పండించంట అంటే మాటలు కాదు. దాంతో ఆయన కాంబినేషన్ సీన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. కానీ అవే సినిమాలో బాగా హైలెట్ అయ్యాయి. మా ఇద్దరి కాంబినేషన్‌లోని దృశ్యాలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది అనుష్క. ఇక ప్రస్తుతం అనూష్క తమిళంలో వేదం రీమేక్ చేస్తోంది. అందులో ఆమె వేశ్యగానే కనిపించనుంది. అయితే తెలుగులో పాత్రకూ దానికీ సంభందం లేదంటోంది. అలాగే ప్రయోగాలను తమిళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కాబట్టి వానమ్ ఇక్కడ పెద్ద హిట్ అవుతుంది అని ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications











