Just In
- 17 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 38 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- Sports
పిచ్‌ను నిదించడం సరికాదు: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విచారణకు హాజరు కావాల్సిందే.. రష్మికకు నోటీసులు
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అర్థమవుతుందా? ఐ యామ్ ఇంప్రెస్డ్ అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది రష్మిక మందాన్న. గ్లామర్‌తో పాటు చిలిపిగా కనిపించి, కవ్వించిన రష్మికపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైలర్ అవుతున్నాయి. ఆమె ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారని, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని, రెమ్యూనరేషన్ పెంచేసిందిని ఇలా పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి వాటి వివరాలేంటో చూద్దాం.

రష్మిక నివాసంలో..
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో ఐటీ అధికారులు గురువారం (జనవరి 16) సోదాలు జరిపారు. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలించారని, ఆదాయం పెరగడం, ట్యాక్స్ కట్టడం లేదనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు వార్తలు వచ్చాయి.

రూ.25లక్షలు స్వాధీనం..
ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే రష్మిక తల్లిదండ్రుల నుంచి ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, లెక్కలోకి రాని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.

తాజాగా నోటీసులు..
ఐటీ దాడులకు సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆమె తండ్రి మదన్ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

రష్మిక క్లారిటీ..
తాను ఐటీశాఖకు కట్టాల్సిన పన్నులు క్రమం తప్పకుండా కడుతున్నానని.. తాజాగా జరిగిన ఐటీ సోదాలు తన తండ్రి చేసే వ్యాపారానికి సంబంధించినవే తప్పించి.. తనకు సంబంధం లేదని రష్మిక చెప్పుకొస్తుందట. అంతేకాదు.. తన ఐటీ లెక్కలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని అందట. రెమ్యూనరేషన్ పెంచానని వార్తలు వస్తున్నాయని, వాటిల్లో కూడా ఎలాంటి నిజం లేదని తెలిపింది.