twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. ఎంత స్వాధీనం చేసుకున్నారంటే..?

    |

    'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయాన్ని ఆస్వాధిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేయడం కలకలం రేపుతోంది.

     సెలెబ్రిటీలపై ఐటీ కన్ను..

    సెలెబ్రిటీలపై ఐటీ కన్ను..

    ఈ మధ్యకాలంలో సినీ నటుల ఐటీ అధికారులు కన్నేశారు. వరుసగా సినీ ప్రముఖుల మీద దాడులు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య నాగార్జున, నాని, వెంకటేష్ లాంటి బడా హీరోల ఇళ్లపై ఐటీ దాడులు చేసిన ఆఫీసర్స్.. ఇటీవలే లావణ్య త్రిపాఠి, అనసూయ, సుమ ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. అయితే అనసూయ, రష్మీలు ఆ వార్తలను ఖండించారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ ఆఫీసర్స్ దాడులు చేయడం హాట్ టాపిక్ అయింది.

    Recommended Video

    IT Rides On Rashmika Mandanna's House !
    వరుస హిట్లు.. భారీ రెమ్యూనరేషన్..

    వరుస హిట్లు.. భారీ రెమ్యూనరేషన్..

    తెలుగులో అతి తక్కవ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఈ కన్నడ భామకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. అందుకే సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ వంటి చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకుంది. రష్మిక భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.

    ఇంటిపై ఐటీ దాడులు..

    ఇంటిపై ఐటీ దాడులు..

    ఇదిలా ఉంటే కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలో ఉన్న రష్మిక మందన్న సొంత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ ఉద్యోగులు ఆమె ఆదాయానికి సంబంధించి లెక్కలను పరిశీలించారు. గురువారం (జనవరి 16) ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఈ సోదాలు జరిగాయి. ఆదాయం పెరగడం, ట్యాక్స్ కట్టడం లేదనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.

    సరైన సమాధానాలు చెప్పలేక..

    సరైన సమాధానాలు చెప్పలేక..

    గురువారం​ ఐటీ అధికారులు బెంగళూరు నుంచి విరాజ్‌పేటకు చేరుకోగా.. ఆ సమయంలో రష్మిక షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రష్మిక తల్లిదండ్రుల నుంచి రష్మిక బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారని, లెక్కలోకి రాని రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    IT Raids On Rashmika Mandanna, They Recovered Nearly 25 Lakh From Rashmika House. Rashmika Parents Failed In Showing Proper Documents. So It Officers Recovered 25 Lakh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X