దిల్ రాజు ఆఫీస్‌పై ఐటి దాడులు

By Pratap

IT raids on Dil Raju office
హైదరాబాద్‌: తన ఎవడు సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దిల్ రాజు కార్యాలయంలోనే కాకుండా నివాసంలో కూడా ఆదాయం పన్ను శాఖ అధికారులు శనివారంనాడు సోదాలు నిర్వహించారు.

దిల్ రాజు పన్ను చెల్లిస్తున్నాడా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఐటి అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఆదాయానికి సంబంధించిన ఆస్తులపై కూడా వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఐటి శాఖ డాటా, రికార్డులకు దిల్ రాజు సమర్పించిన అన్ని పత్రాలను ఐటి అధికారులు పరిశీలించినట్లు చెబుతున్నారు. 1 నేనొక్కడినే సినిమా విడుదలకు ముందు కూడా ఆ సినిమా నిర్మాతలకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఐటి అధికారులు పరిశీలించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విడుదలకు ముందు కూడా ఐటి అధికారులు దిల్ రాజు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. రామ్ చరణ్ తేజ నటించిన ఎవడు సినిమా ఆదివారంనాడు విడుదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X