దూకుడు నిర్మాత అనిల్ ఇంటిపై ఐటి దాడులు
పోటాపోటీ ప్రకటనలు మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా నిర్మాత సుంకర అనిల్ కొంప ముంచినట్లే కనిపిస్తోంది. సుంకర అనిల్ ఇంటిపై, కార్యాలయాలపై సోమవారం సాయంత్రం ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనిల్ ఇంటిలో, కార్యాలయాల్లో గంటల తరబడి సోదాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దూకుడు సినిమా కలెక్షన్లలో తెలుగు సినీ రంగంలో అన్ని సినిమాలను అధిగమించిందని నిర్మాతలు గొప్పగా ప్రకటించుకున్నారు. రామ్ చరణ్ తేజ్ నటించిన మగధీర రికార్డులను కూడా బద్దలు కొట్టిందని చెప్పుకున్నారు. ఇది వివాదంగా మారింది.
చిరంజీవి, మహేష్ బాబు అభిమానుల మధ్య చిచ్చుకు కూడా కారణమైంది. పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. దూకుడు యాభై రోజుల ఉత్సవంలో అనిల్ చాలా ఆవేశంగా ప్రకటన చేశారు. దూకుడు సినిమా కోట్లాది రూపాయలు వసూలు చేసిందని, ఇంత కలెక్షన్లు సాధించిన సినిమా లేదని ఆయన చెప్పారు. తద్వారా ఆయన తెలుగు సినీ రంగంలోని ఓ ప్రముఖ నిర్మాతతో విభేదించినట్లయిందని అంటున్నారు. దూకుడుపై పోటీ పడి ప్రకటనలు ఇవ్వడం వల్లనే అనిల్ ఇంటిపై, కార్యాలయాలపై ఐటి దాడులు జరిగాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











