twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలకు దడ: ఐటీ దిమ్మతిరిగే షాక్?.. జై సింహా, అజ్ఞాతవాసి ఎఫెక్ట్

    |

    Recommended Video

    నిర్మాతలకు ఐటీ దిమ్మతిరిగే షాక్ ?

    సంక్రాంతి వేళ ఐటీ అధికారులు సినీ నిర్మాతలపై కన్నేశారు. ఆయా నిర్మాతల కార్యాయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే ప్రముఖ సంస్థలనే ఐటీ టార్గెట్ చేయడం గమనార్హం. అయితే నిర్మాణ సంస్థలు మాత్రం ఇవి ఐటీ దాడులు కాదు కేవలం టీడీఎస్ సర్వే కోసమే వచ్చారని చెబుతుండటం గమనార్హం.

     ఎందుకీ దాడులు?:

    ఎందుకీ దాడులు?:

    టాలీవుడ్‌కు చెందిన 8 మంది బడా నిర్మాతలు గత మూడేళ్లుగా టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్షన్ అట్ సోర్స్) చెల్లించకపోవడంతోనే ఐటీ ఆయా నిర్మాణ సంస్థలను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు 8మంది నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహించారు.

     ఇవే.. ఆ బడా సంస్థలు:

    ఇవే.. ఆ బడా సంస్థలు:

    ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన నిర్మాణ సంస్థల్లో 'సురేష్ ప్రొడక్షన్స్, హారిక అండ్ హాసిని, భవ్య క్రియేషన్స్, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్, సీకే ఎంటర్‌టైన్మెంట్, వెంకటేశ్వర క్రియేషన్స్' ఉండటం గమనార్హం.

    జై సింహా, అజ్ఞాతవాసి ఎఫెక్ట్:

    జై సింహా, అజ్ఞాతవాసి ఎఫెక్ట్:

    ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన నిర్మాణ సంస్థలన్నింటికీ.. ఇటీవల విడుదలైన జై సింహా, అజ్ఞాతవాసి సినిమాల నిర్మాణంలో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రమేయం ఉండటం గమనార్హం. కొన్ని నిర్మాణ సంస్థలు ప్రత్యక్షంగా నిర్మాణంలో పాలుపంచుకొనగా.. మరికొన్ని డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ పరంగా వ్యాపార లావాదేవీల్లో పాలుపంచుకున్నాయి.

     నోటీసులిచ్చాకే..:

    నోటీసులిచ్చాకే..:

    ఆయా నిర్మాతలకు ముందుగా నోటీసులు జారీ చేశాకే ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. టీడీఎస్(ట్యాక్స్ డిడెక్షన్ అట్ సోర్స్)పై వాళ్ల నుంచి ఎటువంటి బదులు లేకపోవడంతోనే ఐటీ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

     చర్యలు తప్పవా?:

    చర్యలు తప్పవా?:

    ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న పలు పత్రాల ఆధారంగా దీనిపై విచారణ జరగనున్నట్లు సమాచారం. 1961 ఐటీ యాక్ట్ ప్రకారం టీడీఎస్ విషయంలో పక్కా సమాచారం ఇవ్వనివాళ్లపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

    English summary
    A team of IT Officials conducted inspection on Tollywood production houses to enquire over TDS payments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X