హీరో మహేష్ బాబు ఇంటిపై ఐటీ దాడులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిపై గురువారం సాయంత్రం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన ఇంట్లో ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న మహేష్ బాబు ఐటీ రైడ్స్ నేపథ్యంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం సాధించడంతో పాటు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీనికి తోడు కమర్షియల్ యాడ్స్ విషయంలో టాలీవుడ్ హీరోలందరిలో మహేష్ బాబుదే అగ్రస్థానం. దీంతో కోట్లాది రూపాయల సంపాదన ఉన్న మహేష్ బాబు ఆదాయపు పన్ను సరిగా కడుతున్నాడా? లేదా? అని తనిఖీ చేయడానికే ఐటీ అధికారులు సడన్ గా రైడ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా మహేష్ బాబు లాంటి స్టార్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











