IT Raids on Pushpa-2 Producers: 1850 కోట్ల పుష్ప 2 లెక్క తేల్చండి.. మైత్రికి ఐటి శాఖ షాక్

IT Raids on Pushpa-2 Producers: టాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రెటీలపై ఐటీ దాడులు జరగడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపు పన్ను శాఖ అధికారులు టాలీవుడ్ ప్రొడ్యూసర్లపై మెరుపుదాడి చేశారు. పుష్ప 2 నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీ మేకర్స్ సహ యజమాని యలమంచిలి రవిశంకర్ నివాసాలపై ఐటీ దాడులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

మైత్రీ మూవీ మేకర్స్, వాటి సీఈవో చెర్రీ ఆస్తులపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నివాసంతో పాటు వారి కార్యాలయాలపైనా అధికారులు దాడులు చేశారు. అయితే.. ఆకస్మిక తనిఖీల వెనుక కారణం తెలియరాలేదు. కానీ,అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించిన పుష్ప 2 ది రూల్. ఈ చిత్రాన్ని నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్.

IT Raids Pushpa 2 Producers Naveen Yerneni And Yalamanchili Ravi Shankar s Properties

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమానే పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ ను వెచ్చించినట్లు ఇండస్ట్రీ టాక్. భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది పుష్ప 2. తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది.

ఆర్ఆర్ ఆర్, కల్కి, బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇట్ సినిమాల రికార్డులను సైతం అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేసింది. అలాగే..ఇటీవల సంక్రాంతి కానుకగా పుష్ప 2లో 20 నిమిషాల ఫుటేజీతో రీలోడెడ్ వెర్షన్ పేరిట రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ . దీంతో కొన్ని ఏరియాలలో వసూలు కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇలా పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. దీని బట్టి పుష్ప 2 ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

IT Raids Pushpa 2 Producers Naveen Yerneni And Yalamanchili Ravi Shankar s Properties

ఇలాంటి భారీ విజయనందుకున్న మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి అధికారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వారు పుష్ప 2 సంబంధించిన కలెక్షన్ల వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు పుష్పట్టు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే ఓ మహిళ అభిమానురాలు మృతి చెందగా ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పుష్ప 2 మూవీ మేకర్స్ పై, ఆ థియేటర్ యజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..

అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. బెయిల్ పై బయటకు రావడం వంటి ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ప్రీమియర్ షో లకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణం పుష్ప 2 నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి దాడులు జరగడం చర్చనీయంగా మారింది. ఈ దాడుల వెనుక రాజకీయపరమైన వ్యూహం ఏమైనా ఉందా? అంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. దిల్ రాజుకు చెందిన 8 ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం ఉజాస్‌, కార్యాలయంతో సహా ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షితారెడ్డి నివాసాలపై కూడా సోదాలు నిర్వహించారు. దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను కలిగి ఉన్నారు. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X