దానికి రాజమౌళి సమాధానం చెప్పాలి...ఎన్టీఆర్
ప్రస్తుతం మనాలీలో శక్తి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ట్విట్టర్ లో మర్యాదరామన్న చిత్రం గురించి ట్వీట్ చేసారు.ఆయన మాటల్లో..మర్యాద రామన్న చిత్రానికి మంచి రిపోర్ట్ వస్తున్నాయని వింటున్నాను. కంగ్రాట్స్ జక్కన్న. అది నేను రాజమౌళిని పిలిచే పేరు. అలాగే సునీల్ కు కూడా కంగ్రాట్స్. ఇక చాలా మంది రాజమౌళితో నేను హీరోగా చేసే చిత్రం మళ్ళీ ఎప్పుడు అని అడుగుతున్నారు.దానికి రాజమౌళినే సమాధానం చెప్పాలి అన్నారు. ఇక శక్తి చిత్రాన్ని మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ డైరక్ట్ చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. డిఫెరెంట్ లొకేషన్స్ తో భారీ బడ్జెట్ తో ఎడ్వంచర్ ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
శక్తి రాజమౌళి యమదొంగ సింహాద్రి ఇలియానా అశ్వనీదత్ మెహర్ రమేష్ meher ramesh yamadonga simhadri ashwini dutt ileana


Click it and Unblock the Notifications