అనుష్క ఇంటిపై ఐటి దాడులు
టాలీవుడ్ సెక్సీ తార అనుష్క ఇంటిపై బుధవారం ఆదాయపు శాఖ అధికారులు దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో అనుష్క ఇంట్లో ఉన్నారు. ఉన్నపలంగా బంజారా హిల్స్ లోని అనుష్క ఇంటిపై రైడ్ చేసిన అధికారులు....పలు కీలక పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె ఐటీ లెక్కలు సరిగా ఉన్నాయో? లేవో? అక్రమ ఆస్తులు ఏమైనా దొరికాయా? అనే విషయం తేలాల్సి ఉంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుష్క సరైన వివరాలు సమర్పించక పోవడం వల్లనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
తన నటించే సినిమాలకు రూ. కోటికిపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా...అనుష్కకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. అరేబియన్ గుర్రంలా పిటపిటలాడే అందాలతో యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనుష్క అరుంధతి సినిమా విజయం తర్వాత వరుస సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. సినిమా సినిమా కోటికి తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఈ భామ బాగానే వెనకేసుకుందనే ప్రచారం సినీ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరుగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











