twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాయక్, SVSC ఎఫెక్ట్: దిల్‌రాజు ఆఫీస్‌పై ఐటీ దాడులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'నాయక్' సినిమా నిన్న విడుదలై ఓ వైపు నైజాం ఏరియాలో భారీగా వసూళ్లు సాధించింది. మరో వైపు విడుదలకు ముందే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం అదిరపోయే బిజినెస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతలపై ఇన్‍‌కం టాక్స్ అధికారుల కన్ను పడింది.

    నిర్మాత దిల్ రాజు ఆఫీసుపై గురువారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు జరిపారు. అదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా జరుగుతున్నాయి. దిల్ రాజు సిని నిర్మాణ సంస్థ 'శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్'కు సంబంధించిన లెక్కలన్నీ పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఐటి డిపార్ట్ మెంటుకు చూపుతున్న లెక్కలు అక్రమమా? సక్రమమా? అనేది సోదాల అనంతరం అధికారులు ప్రకటించనున్నారు. మరో వైపు నాయక్ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులు జరిపారు.

    నైజాం ఏరియాలో దిల్ రాజు 'నాయక్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రేపు విడుదలవుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి దిల్ రాజు స్వయంగా నిర్మాత. అదే సమయంలో ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది కూడా ఆయనే.

    నైజాం ఏరియాలో దిల్ రాజు బలమైన డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాడు. ఆయన చెప్పుచేతల్లో(లీజ్ రూపంలో?) కొన్ని వందల థియేటర్లు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజుతో పాటు మరికొందరు నిర్మాతలపై కూడా ఐటి డిపార్ట్ మెంట్ కన్ను పడినట్లు తెలుస్తోంది. త్వరలో వారి ఆఫీసులు, ఇళ్లపై కూడా దాడులు జరుపేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు.

    English summary
    IT Rides On Dil Raju office on Thursday. He is producer of Mahesh Babu-Venkatesh starrer movie Seethamma Vakitlo Sirimalle Chettu and Distributor of Ram Charan starrer Nayak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X