»   » సరైన సమయమనే భావిస్తున్నా:రామ్ చరణ్

సరైన సమయమనే భావిస్తున్నా:రామ్ చరణ్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నామా లేదా అనేది కాదు...రైట్ పర్శన్ ని చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి అన్నారు రామ్ చరణ్. మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటున్నానని భావిస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే కెరీర్ లో సెటిల్ కాని వారు పెళ్లి గురించి ఆలోచించరు. కానీ నేను రాబోయే ఇరవై ఏళ్ళ వరకూ నా కెరీర్ బావుంటుందనే భాటవిస్తున్నాను.ప్రస్తుతం నేను చాలా ఫోకస్ గా ఉన్నాను. ఇదే నా జీవితంలో నేను వివాహం చేసుకోవటానికి సరైన సమయం అని భావిస్తన్నాను అన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ దాదాపు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది. అలాగే అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనిని వివాహ విషయమై తరుచుగా వార్తల్లో ఉంటున్నారు.

    English summary
    I feel that whoever isn't feeling settled in their career, won't think about their marriage. But I'm at a place where I can see where my career is headed for the next 20 years. I'm very focussed now and I had the time to think about settling down with someone. And anyway, getting married is not about the right age, it's about finding the right person. And I did....Ram Charan
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more