బాలకృష్ణ మార్కు సినిమా ఇది
దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ, జగపతిబాబుపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.
'సింహా'లో బాలయ్యలో కనిపించిన వాడి వేడి ఏ మాత్రం తగ్గవు. అందరూ అనుకుంటున్నట్లు రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయో లేదో చెప్పలేను. ఒకవేళ ఉంటే.. పైన చెప్పిన అంశాలకు ఇవి బోనస్ అవుతాయి. అంతేకానీ అవి లేకుండా పాలిటిక్స్‌కే పరిమితం అయ్యే సినిమా కాదు. బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా. సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications












