ఈ పదేళ్లలో ఎవరికీ భయపడింది లేదు, కానీ ఈ రోజు వాడి ముందు : నాని హాట్ కామెంట్స్

By Bojja Kumar

Recommended Video

NANi Tweets About His Journey In Film Industry

సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో నాకు ప్రేక్షకుల నుండి ఎంతో ప్రేమ లభించింది.... అంటూ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చారు.

సరిగ్గా దశాబ్దం క్రితం సెప్టెంబర్ 5న 'అష్ట చెమ్మా' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలు అందుకుంటూ, తన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని నేచురల్‌స్టార్‌గా ఎదిగాడు. ఈ సందర్భంగా నాని క్రింది విధంగా వ్యాఖ్యానించారు.

నా లాంటి యావరేజ్ అబ్బాయి.. ఎవరూ ఊహించలేదు

నా లాంటి యావరేజ్ అబ్బాయి.. ఎవరూ ఊహించలేదు

ఎవరు ఊహించి ఉంటారు. నేను పదేళ్లు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతానని? ఎవరు ఊహించి ఉంటారు నటనలో యావరేజ్ స్కిల్స్ ఉన్న నాలాంటి యావరేజ్‌ అబ్బాయిని ఆదరిస్తారని? మీ అందరూ ఆదరించడం వల్లనే ఓ నటుడిగా, మనిషిగా ఎదిగాను... అని నాని చెప్పుకొచ్చారు.

నా మనసును ఫాలో అవుతున్నాను

నా మనసును ఫాలో అవుతున్నాను

నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి నా నుంచి బెస్ట్‌ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా మనసు నచ్చింది ఫాలో అయ్యాను, ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను.

 విజయాలు, అపజయాలు

విజయాలు, అపజయాలు

ఈ పదేళ్ల ప్రయాణంలో విజయాలను చూశాను. అపజయాలను చూశాను. నాకు తెలుసు ఈ రెండూ జీవితంలో వచ్చి వెళుతుంటాయని. మీరు నాపై మీరు చూపిన ప్రేమాభిమానాలకు థాంక్యూ అనేది చిన్న పదం. కానీ మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు మాత్రమే చెప్పుకోగలను.... అని నాని వ్యాఖ్యానించారు.

కొడుకు జున్నుతో దిగిన ఫోటో

‘ఎవరి ముందైనా నటించడానికి ఎన్నడూ భయపడింది లేదు. కానీ మిస్టర్‌ జున్ను ఈ రోజు డాక్టర్‌ దాస్‌ను కలవడానికి సెట్స్‌కు వచ్చాడు' అంటూ తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోను నాని షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X