»   » 15 ఏళ్ల సినీ జర్నీ: అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్

15 ఏళ్ల సినీ జర్నీ: అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య, మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.... ఇలా తాతయ్య, మామయ్య, తండ్రి సపోర్టుతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నటుడిగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్న హీరో అల్లు అర్జున్‌. తనకంటూ ప్రత్యేకమై స్టైల్ ఏర్పరుచుకుని టాలీవుడ్లో స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన బన్నీ... ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటితో పదిహేనేళ్లు పూర్తయింది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం 'గంగోత్రి' ద్వారా బన్నీ తెరంగ్రేటం చేశారు.

కెరీర్లో 15 ఏళ్ల జర్నీ పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశారు. పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. ఈ జర్నీలో నాకు తోడుగా సాగిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నన్ను హీరోగా లాంచ్ చేసిన ముఖ్యంగా దర్శకులు రాఘవేంద్రరావుగారికి, అశ్వినీదత్ గారికి, మా నాన్నకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

It’s been 15 yrs I entered into films: Allu Arjun

తొలి సినిమాతోనే మంచి గర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ 'ఆర్య' సినిమాతో తొలి విజయం అందుకున్నారు. ఆ త్వాత చేసిన బన్నీ, దేశ ముదురు చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. జులాయి, రేసుగుర్రం, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బన్నీ టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు

ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
"It’s been 15 yrs I entered into films. I thank each and everyone who has been a part of this journey . I Thank KRR garu , Ashwini Dutt garu & dad for Launching me . Truly Blessed . Thank you all. Gratitude." Allu Arjun tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X