మహేష్ బాబుకు ఇదే సరైన టైం అంటున్నారు!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ రాకెట్‌లా దూసుకెలుతోంది. ఓ వైపు చేతిలో వరుస భారీ సినిమాలు. మరో వైపు చేతి నిండా ఎండార్స్‌మెంట్లు. దీని తోడు అవార్డులు, రివార్డులు మహేష్ బాబును వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో టాప్ 50లో మొదటి స్థానం దక్కించుకున్నాడు మహేష్ బాబు.
బాలీవుడ్ టాప్ స్టార్లను, క్రికెటర్లను వెనక్కి నెట్టి మహేష్ బాబు ఈ ఘనత దక్కించుకోవడం చర్చనీయాంశం అయింది. ఈనేపథ్యంలో మహేష్ బాబుకు పలువురు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. ఇదే సరైన సమయమని, క్రేజ్ వచ్చినప్పుడే ఎంట్రీ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. మరో వైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సెనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా లాంటి మహేష్ బాబుతో సినిమాలను చేయాలని ఉందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలపై ఏమైనా దృష్టి సారిస్తారో? లేదో? చూడాలి.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తున్నాడు. 'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా హీరోయిన్. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











