దేవుడిని వేడుకుంటా...!
ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
Recommended Video

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన'' గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా జీవిత రాజశేఖర్ దంపతులు హాజరయ్యారు.,వారితో పాటు సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.నిర్మాత నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ అమ్మ గొప్పతనం గురించి,ఇంకా తన అమ్మ జ్ఞాపకాలను బద్రంగా దాచుకున్న విధానం చెప్తూనే.,సినిమాలో వున్నా అసలు సస్పెన్సు చెప్పేసారు.,
నటి,నిర్మాత.జీవిత మాట్లాడుతూ మమ్మలి ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినందుకు రాధిక శరత్ గార్కి ధన్యవాదాలు ''అందరికి డబ్బుంటుంది,పేరుంటుంది కాని ప్రేమించే మనసు మాత్రం కొంతమందికే వుంటుంది'' అది విల్లకే వుంది నిజంగా విజయ్ అంటోని చాలా కష్టపడే మనిషి సినిమా చూస్తున్నప్పుడు ఎవ్వరైనా డోర్ ఓపెన్ చేస్తే సినిమా చూడరేమో అని కంగారు పడుతున్నాడు అంత ప్రేమ సినిమా అంటే.,నిజంగా నేను మీ సినిమా కోసం దేవుడిని వేడుకుంటా తప్పకుండ సినిమా మంచి హిట్ అవుతుంది సినిమాలో చాలా మంచి సందేశం వుంది అని యూనిట్ అందర్నీ అభినందించారు.,ఇది ఇలా వుండగా రాజశేఖర్ మధ్యలో ''పి.ఎస్.వి.గరుడవేగా'' గురించి కూడా చెప్పు అని నవ్వించారు.


Click it and Unblock the Notifications











