మొత్తం కధ చెప్పేసాడు.....!
డైరెక్టర్ వాసు మాట్లాడుతూ 1980 లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాని ఇప్పుడు అవి కనపడట్లేదు ప్రస్తుతం తల్లి కూతుళ్ళు మాత్రం వాట్స్ ఆప్ లో చాటింగ్ చేసుకుంటూ కష్టాలు ఏం లేవు అనుకుంటున్నారు.
Recommended Video

భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.గురువారం ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అందరూ హాజరయ్యారు.
ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా నిర్మాత భాస్కర్ యాదవ్ నన్ను చాలా విసిగించాడు. నేను కొన్ని సార్లు ఇటువంటి సినిమాలు చిన్న సినిమాలు నడవవు అని కూడా అన్నాను.
కానీ తను మొండిగా కష్టపడ్డాడు. సినిమా చేసి చూపించాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మతనే హీరో అంటూ చాలా ఆవేశంతో చిన్న సినిమాలు విడుదల చేసుకోటానికి సరిగా థియేటర్స్ కుడా లేవు.. ఇటువంటి పరిస్థితుల్లో కుడా సినిమాలు తీస్తున్నారు అంటే సినిమా మీద ఎంత అభిమానం వుందో తెలుసుకోవాలి. నా వంతుగా నేను సాహసం చేస్తాను సినిమా విడుదల కోసం నేను ముందు నిలబడుతా అంటూ వేదిక సాక్షిగా నిర్మాతకి మాటిచ్చారు.
డైరెక్టర్ వాసు మాట్లాడుతూ 1980 లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాని ఇప్పుడు అవి కనపడట్లేదు ప్రస్తుతం తల్లి కూతుళ్ళు మాత్రం వాట్స్ ఆప్ లో చాటింగ్ చేసుకుంటూ కష్టాలు ఏం లేవు అనుకుంటున్నారు. దాని వల్ల మానసికంగా బాధపడుతున్నారు. ఇప్పటి జనరేషన్ ఎలా వుందో అదే చూపిస్తున్నాం చాలా బాగా ప్రేమించుకునే ఒక జంట జీవితంలోకి రాబందులా ఒకడోస్తే ఆ జంట ఏమైపోయారు..? చివరికి ఏం జరిగింది అనేది కధ...స్క్రీన్ ప్లే ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా వుంటుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











