»   » మెగా ఫోన్ పట్టి నేనే నెం వన్ లేడీ డైరెక్టర్ ని అవుతా..

మెగా ఫోన్ పట్టి నేనే నెం వన్ లేడీ డైరెక్టర్ ని అవుతా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్‌ కమ్ముల స్కూల్‌ నుంచి వచ్చిన హోమ్లీగాళ్‌ కమలినీ ముఖర్జీకి ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లడంతో తన రూట్‌ మార్చి మోడ్రన్‌ డ్రెస్సుల్లో యూత్‌ గుండెల్లో గుబులు పుట్టించేస్తోంది. చెయ్యక చెయ్యక మలయాళంలో ఓ సినిమా చేసింది. పాపం అదికూడా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి సరసన కదా అనుకుంది...తీరా ఆ సినిమా విడుదలయ్యాక కమలినికి బోలెడంత పేరు వచ్చింది. అదెలాగంటే ఆ సినిమాలో ఓ న్యూడ్‌ సీన్‌ ఉంది. కమలినీ అది తాను కాదని మొత్తుకుంటున్నా దానిని నెటినెన్స్‌ యూట్యూబ్‌ లో చూసేసి తెగ ఆనందపడిపోతున్నారు.

రీసెంట్‌ గా కమలిని వెంకటేష్‌ తో 'నాగవల్లి" చిత్రంలో నటించినా అంతగా పేరురాలేదు. ఇక తన కెరీర్‌ ను ఇంకోరకంగా మలుచుకోవాలని అనుకుంటోంది కమలిని. ఎప్పటినుంచో సినిమాకు డైరెక్షన్‌ చేయాలని అనుకుంటోందట. ఈ విషయం తన ఫ్రెండ్స్‌ వద్ద గతంలో చాలాసార్లే ప్రస్థావించిందట. పైగా సినిమా కథలు కూడా స్క్రిప్ట్‌ తో తన వద్ద కొన్ని ఉన్నాయట. ఎవరైనా అడిగితే ఇద్దమనుకుంటోందట. ఎవరైనా నిర్మాత ధైర్యంగా తనవద్దకు వస్తే తన స్క్రిప్ట్‌ ఇస్తానంటోంది. హీరోయిన్‌ గా ఎవరున్నా తనకు అభ్యంతరం లేదంటోంది. ఒక్క అవకాశం వస్తే తానేంటో నిరూపిస్తానంటోంది కమలిని. ఆల్‌ ద బెస్ట్‌ అంటున్నారు ఆమె అభిమానులంతా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu