అన్నాను... కానీ, అది అబద్ధం!: మహేష్

By Srikanya

హైదరాబాద్ : మొన్నెప్పుడో ఓ ఇంటర్వ్యూలో 'కథ ఉంటే చేస్తాను' అన్నాను... కానీ, అది అబద్ధం! నిజం చెప్పాలంటే... ఈ జనరేషన్‌లో మల్టీసారర్స్ చేయడం చాలా కష్టం! మీరన్నట్టు ఈగోలు, ఫ్యాన్స్... ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోవాలి. నావల్ల అది అవుతుందో లేదో చెప్పలేను. అందరితో చేయడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం నేను ఎవరితోనై చేయగలనంటే... ఈయన ఒక్కరితోనే అనిపిస్తోంది అంటూ వెంకటేష్ ని చూపెట్టారు మహేష్ బాబు. వెంకటేష్ తో ఆయన కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘన విజయం సాధించిన నేపద్యంలో ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పై విధంగా మాట్లాడారు.

అలాగే తనకు,వెంకటేష్ కు మధ్య ఉన్న రాపో గురించి చెపుతూ.. టీంగా అందరం ఒకరితో ఒకరం కంఫర్టబుల్‌గా ఫీలవ్వడానికి వెంకటేష్‌గారు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టారు. షూటింగ్ మొదలయ్యే ముందే ఓరోజు 'అందరం కలుద్దాం' అని చెప్పి, మా ఇంటికొచ్చారు. అంతేకాదు, మొదటి రెండు రోజులు నాకు మాత్రమే షూట్ ఉన్నా, ఈయన అదేపనిగా ఓరోజు ముందు వచ్చి, షూటింగ్ స్పాట్‌లో ఉండి వాతావరణాన్ని చాలా కంఫర్టబుల్‌గా ఉంచారు అన్నారు.

అంతేగాక... వెంకటేష్‌గారికి ఉన్న ఫోకస్, కన్సిస్టెన్సీ చాలా తక్కువ మందికి ఉంటుంది! నాకు తెలిసి ఆయన ఇచ్చినన్ని వరుస హిట్స్ కూడా ఇప్పటిదాకా ఏ హీరో ఇవ్వలేదు. అంత సాధించినా ఇప్పటికీ అదే ఫోకస్ మెయిన్‌టెయిన్ చెయ్యడం అంత ఈజీ కాదు. అదికాక, మొత్తంగా సినిమా మీద ఆయనకున్న పట్టు, దృష్టి, పరిశీలన... ఒక సీన్ సినిమాలో దేనితో కనెక్టవుతుంది అన్న గ్రాస్ప్... చాలా అరుదుగా చూస్తాం! ఇదంతా ఒకెత్తయితే, ఏది వర్కవుటవుతుంది, ఏది వర్కవుట్ అవదు అన్న విజన్, జడ్జిమెంట్... జస్ట్ అన్‌బిలీవబుల్! ఇవన్నీ ఈయన దగ్గరనుంచి నేర్చుకోవలసినవే అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X