twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫీషియల్ : ‘శ్రీమంతుడు’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన

    By Srikanya
    |

    హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' రిలీజ్ డేట్ పై ఉన్న అనుమానాలు,రూమర్స్ కు తెరదించుతూ...చిత్రం నిర్మాతలు, దర్శకుడు కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. ఆగష్టు 7న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9. అంటే పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగానే కానుక వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

    It's Official: Srimanthudu On Aug 7th

    మరోప్రక్క ‘శ్రీమంతుడు' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.

    అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినమాలో ది మాత్రం కాదన్నారు.

    మరో ప్రక్క తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

    English summary
    Producers of the flick have officially confirmed today that Srimanthudu will be hitting cinemas on August 7th with Aug 9th being Mahesh's birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X