»   » కోన వెంకట్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిప్ట్ (ఫోటో)

కోన వెంకట్ కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిప్ట్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ రచయిత కోన వెంకట్ కి, పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. సోదరుడులాంటి పవన్ కల్యాణ్ ఓ బెస్ట్ గిప్ట్ ఇచ్చారని ఆయన తెలియచేసారు. ఇంతకీ పవన్ ఇచ్చిన గిప్ట్ ఏమిటీ అంటే...ఆయన రచించిన ఇజం పుస్తకం కాపీ. ఆ పుస్తకం మొదటి పేజీలో.. టు మై బ్రదర్ కో..విత్ లవ్ అని పవన్ సంతకం పెట్టి ఇచ్చారు. ఆ పుస్తకంలో ఆ పేజీ ఫోటో మీరు ప్రక్కన చూస్తున్నది.

ఈ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కోన వెంకట్. ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. మంచి స్టోరీతో వస్తే తప్పకుండా దర్శకత్వం చాన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కోన వెంకట్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఓ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్న కోన వెంకట్.....ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో లేని విధంగా డిఫరెంటుగా, అందరికీ నచ్చే విధంగా, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

It's Pawan Kalyan gift to Kona Venkat

మరో ప్రక్క కోన వెంకట్‌ ఇప్పుడు బాలీవుడ్‌ రచయిత కాబోతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా రూపొందనున్న సినిమాకి ఆయన కథ రాస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు కోన. ''అభిషేక్‌ సినిమా కోసం పని చేయబోతున్నాను. ఒప్పందం జరిగింది. భారతీయ సినీరంగంలో ఇప్పటివరకూ రాని కథని సిద్ధం చేయబోతున్నా'' అని పేర్కొన్నారు కోన.

ఇక రచయితలు దర్శకులుగా మారడం ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి రచయిత కోన వెంకట్‌ వచ్చి చేరారు. 'రామ్‌ అండ్‌ జూలియట్‌' పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించారాయన. న్యూయార్క్‌ నేపథ్యంలో నూతన నటీనటులతో సాగే ప్రేమకథ ఇది. వరశీ మదిరాజు, రామ్‌ గోలి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి,మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా కేవలం అంతర్జాలంలోనూ, టీవీల్లోనే విడుదల చేస్తున్నారు.

మరో ప్రక్క కోనవెంకటే ప్రసుతం మరికొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'పవర్' సినిమా స్క్రిప్ట్ కోసం ఎస్. రవీంద్రతో కలిసి పనిచేసాడు. అలాగే తను పనిచేసిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

English summary
Kona Venkat said..."The best gift I have ever received in my life.. A gift from my brother& Soulmate Pawan Kalyan!!! "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu