twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు క్రియేట్ చేసిన 'పంజా' ట్రైలర్

    By Srikanya
    |

    యూట్యూబ్‌లో కేవలం రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల మంది పంజా ట్రైలర్‌ని చూడటం ఓ రికార్డ్‌ . ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర ఇంటర్‌నెట్ ఏ తెలుగు సినిమాకీ రానన్ని హిట్టింగ్స్‌ని పంజా సొంతం చేసుకుంది.కలకత్తా మాఫియా కార్యకలాపాలను ఇందులో విష్ణువర్థన్ కొత్తగా ఆవిష్కరించారని చెప్తున్నారు. పవర్‌స్టార్ పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి మెయిన్ ఎట్రాక్షన్. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పవన్ కల్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో సినిమా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ వచ్చిన పవన్‌కల్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి.

    నవంబర్ 13న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున ఆడియో ఆవిష్కరణ చేయబోతున్నాం. యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డిసెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం** అని నిర్మాతలు తెలిపారు. పవన్‌కల్యాణ్ సరసన సారాజేన్ డయాస్, అంజలి లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడవి శేష్, జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, ఝాన్సీ, తనికెళ్ల భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సంపత్, కిశోర్ ముఖ్య తారలు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్, యాక్షన్ కొరియోగ్రాఫర్: శామ్ కౌశల్, ఆర్ట్: సునీల్‌బాబు, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, సంభాషణలు: అబ్బూరి రవి, స్టైలింగ్:అనూ వర్థన్.

    English summary
    Audio of Pawan Kalyan's Panjaa is finally hitting the market on November 13. Except for a song, we have wrapped up the shooting part and we are releasing the music on November 13," said producers Neelima Tirumalashetty and Shobu Yarlagadda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X