»   »  సన్నీ లియోన్ వెంటపడుతున్న సౌత్ ఫిల్మ్ మేకర్స్

సన్నీ లియోన్ వెంటపడుతున్న సౌత్ ఫిల్మ్ మేకర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోర్న్ సినిమాలు మానేసి ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్లో దూసుకెలుతున్న సన్నీ లియోన్ ఇపుడు సౌత్ సినిమాలపై కూడా దృష్టి సారించింది. 'వడాకర్రీ' అనే తమిళ చిత్రంలో ఐటం సాంగు చేయడం ద్వారా ఆమె సౌత్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఐటం సాంగ్ చేయడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. పలువురు తెలుగు, తమిళం ఫిల్మ్ మేకర్స్ ఆమెతో తమ సినిమాల్లో ఐటం సాంగులు చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మరో మూడు తమిళ సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్లు సమాచారం.

'ఓరు ఊర్లా రెండు రాజా' అనే తమిళ చిత్రంలో సన్నీ లియోన్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో ఆమె హీరో విమల్ సరసన కాకుండా....కమెడియన్ పరోట్ట సూరితో స్టెప్పులే వేయబోతోందన తెలుస్తోంది. ఇందుకోసం ఆమె రూ. 35 లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం.

ఫుల్ గ్లామరస్‌గా..

ఫుల్ గ్లామరస్‌గా..


‘ఓరు ఊర్లా రెండు రాజా' చిత్రంలో సన్నీ లియోన్‌‍ను ఫుల్ గ్లామర్‌గా, హాట్ అండ్ సెక్సీగా చూపించబోతున్నారట. ఈ సాంగుకు బృంగా కొరియోగ్రఫీ చేయబోతున్నారు.

ట్రెడిషనల్‌గా...

ట్రెడిషనల్‌గా...


మరో వైపు సన్నీ లియోన్ తెలుగులో మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కరెంటు తీగ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెను మరీ సెక్సీగా కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం చూసేలా ట్రెడిషనల్ లుక్‌లో చూపించబోతున్నారట. వడ కర్రీ అనే చిత్రంలో కూడా ఆమెను అశ్లీలంగా కాకుండా మామూలుగానే చూపించారట.

మూడు సినిమా ఆఫర్లు

మూడు సినిమా ఆఫర్లు


ప్రస్తుతం సన్నీ లియోన్‌కు మరో మూడు తమిళ సినిమాల ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.

హీరోయిన్‌గా కూడా...

హీరోయిన్‌గా కూడా...


తమిళంలో వచ్చిన మూడు ఆఫర్లలో రెండు ఐటం సాంగు ఆఫర్లు కాగా....ఆశ్చర్యకరంగా మరొకటి హీరోయిన్ ఆఫర్ అని తెలుస్తోంది.

సౌత్‌లో పాగా వేస్తోంది

సౌత్‌లో పాగా వేస్తోంది


సన్నీ లియోన్ ఇప్పటికే బాలీవుడ్లో డిమాండ్ ఉన్న తారగా మారింది. ఇపుడు సౌత్‌లో వరుస అవకాశాలు దక్కించుకోవడం ద్వారా ఇక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది.

English summary
Sunny Leone seems to have struck gold with her debut song in Tamil films. She has entered Kollywood with an item number in forthcoming movie Vadacurry. This track has given a good break for her. It is because it is raining offers for her from South film industries. Yes, she is foraying into South in a big way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu