వర్మ-మ్యాగీ ...ఇదో లవ్ స్టోరీ
ఇటీవల నిషేధానికి గురై అనేక వివాదాల్లో ఇరుకున్న నెస్లే మ్యాగీ మొత్తానికి మళ్లీ మార్కెట్ లోకి వచ్చింది. అయితే నిషేధంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ న్యూడిల్స్‌కు వర్మ అడుగడుగునా బాసటగా నిలిచారు. అందుకే మ్యాగీ కూడా ఆయన ప్రేమను, మద్దతును స్వీకరించించామని ఇందుకు ప్రతిగా ఆయనకు ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపిస్తామని తెలిపింది. చిరునామా వివరాలు ఇవ్వమని కోరింది.
దీంతో వర్మ పొంగిపోయారు. దీనిని గౌరవంగా భావించారు. మ్యాగీ బేబి నువ్వు ఇప్పటికీ 20 లక్షల నిమిషాల ఆనందాన్ని కానుకగా ఇచ్చావు. హుమ్మా' అంటూ ఓ ముద్దుపెట్టారు.
ఇలా ట్విట్టర్‌లో నడిచిన మ్యాగీ- వర్మ ప్రేమకథను చూసి ఓ అభిమాని స్పందించాడు. షారుఖ్‌ఖాన్, కాజోల్ జంటగా నటించిన 'దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే' సినిమా కంటే మధురమైన, అతి సుందరమైన ప్రేమకథ మీదేనంటు కితాబిచ్చాడు. అది కూడా నచ్చేయడంతో వర్మ దానిని రీట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











