అది రజనీకాంత్ పై పుట్టిన లేటెస్ట్ రూమర్ !?
తాజాగా రజనీకాంత్ ఇద్దరు తన వ్యక్తిగత సిబ్బందిని ముంబైకి పంపి, బాలీవుడ్ తారల ఫోన్ నంబర్సును కలెక్ట్ చేయమని చెప్పినట్లు అన్ని మీడియాల్లోనూ ప్రముఖంగా వినపడుతోంది. అయితే కేవలం రూమర్ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. దానికి రీజన్ తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. లాజిక్ గా ఆలోచిస్తే..రజనీకాంత్ కి హఠాత్తుగా బాలీవుడ్ స్టార్స్ తో పనేమొచ్చిందీ అంటే...రోబో (తమిళంలో ఎంథిరన్) చిత్రాన్ని ముంబైలో స్పెషల్ స్క్రీన్ చేసి, ఆ స్క్రీనింగ్ కి కొందరు స్టార్ హీరో, హీరోయిన్స్ ని ఆహ్వానించాలనుకున్నారని చెప్తున్నారు. దానిని సపోర్టు చేస్తూ రజనీ దగ్గర కేవలం అమితాబ్ నెంబర్ తప్ప ఎవరదీ లేదని అందుకే ఇలా ఫోన్ నెంబర్ల ఎంక్వైరీ చేస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఆ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్య రాయ్ చేసింది కదా...ఆమెకు బాలీవుడ్ స్టార్స్ అంతా పరిచయమే కదా...ఆవిడ మేనేజర్ ని అడిగినా నెంబర్స్ దొరుకుతాయి కదా..ఎందుకంటే రోబో..ముంబై స్క్రీనింగ్..రజనీతో పాటు ఐశ్వర్య రాయ్ కీ అవసరమే కాబట్టి ఇదంతా నిజంకాదు..తమిళ మీడియా పుట్టిస్తున్న రూమర్ అని ముంబే పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











