»   » బాహుబలి లక్ష్యం రూ. 1000 నుంచి 1500 కోట్లా.. ట్రేడ్ అనలిస్టుల అంచనా

బాహుబలి లక్ష్యం రూ. 1000 నుంచి 1500 కోట్లా.. ట్రేడ్ అనలిస్టుల అంచనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు సినిమా వంద రోజుల ఆడితే ఘనవిజయం సాధించినట్టు లెక్క ఉండేది. అయితే ప్రస్తుతం ఎక్కువ రోజుల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తక్కువ రోజుల్లో ఎంత ఎక్కువ మొత్తం వసూలు చేసిందనే దానినే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తున్నారు.

100 కోట్లు క్లబ్ కొలమానం

100 కోట్లు క్లబ్ కొలమానం

ఇటీవల కాలంలో రూ.100 కోట్ల క్లబ్ అనేది సినిమా సామర్థ్యానికి కొలమానంగా మారింది. వంద కోట్ల క్లబ్‌లో చేరితే ఈ చిత్రం సూపర్ సక్సెస్ అనే మాట వినిపిస్తున్నది. ఇప్పటివరకు వంద కోట్ల క్లబ్‌లో బాలీవుడ్ చిత్రాలదే హవా. ఈ క్లబ్‌లో ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలు కూడా చేరుతున్నాయి. తెలుగులో అత్తారింటికి దారేది, బాహుబలి.. తమిళంలో రోబో, కబాలి.. మలయాళంలో పులిమురుగన్ చిత్రాలు వందకోట్లు కొల్లగొట్టాయి


బాహుబలికి ఆకాశమే హద్దు..

బాహుబలికి ఆకాశమే హద్దు..

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొన్నది. రికార్డుస్థాయిలో రూ.600 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి సంచలనం స‌ృష్టించేందుకు బాహుబలి2 సిద్ధమైంది. బాహుబలి2 విడుదలకు ముందే రూ.500 కోట్ల బిజినెస్ చేసింది. విడుదల తర్వాత ఈ చిత్రం రూ.1000 కోట్ల నుంచి 1500 కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.


బాహుబలి2పై భారీ అంచనాలు..

బాహుబలి2పై భారీ అంచనాలు..

చరిత్రలో నిలిచిపోయే విధంగా బాహుబలి2 చిత్రం కలెక్షన్లు వసూలు చేస్తుందనడానికి ఆ చిత్రంపై ఉన్న క్రేజ్ చెప్పకనే చెప్తున్నది. దేశవ్యాప్తంగా బాహుబలి2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మార్చి 17న విడుదల చేసిన ట్రైలర్ గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో లక్షల మంది వీక్షించారు. గంట గంటకు వ్యూస్ లెక్కలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


ఇప్పటివరకు పీకే చిత్రానిదే రికార్డు

ఇప్పటివరకు పీకే చిత్రానిదే రికార్డు

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రానిదే రికార్డు. ఈ చిత్రం రూ.792 కోట్లు విడుదల చేసింది. ఇటీవల వచ్చిన దంగల్ చిత్రం నోట్ల రద్దు నేపథ్యంలో కూడా దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసింది. ఇంకా టాప్ లిస్ట్‌లో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం రూ. 626 కోట్లు కొల్లగొట్టింది.


1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ దిశగా బాహుబలి2

1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ దిశగా బాహుబలి2

భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఏ చిత్రం కూడా చేరుకోలేకపోయింది. బాహుబలి2 చిత్రంపై దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నందున ఈ చిత్రం రూ.1000 నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా

బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా

సుమారు 10 వేల థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే కలెక్షన్లు బాహుబలిని వసూళ్ల సునామీ ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి2 రూ.1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. బాహుబలితోపాటు రోబో 2.0 చిత్రం కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే భారతీయ సినిమా సక్సెస్‌కు దక్షిణాది సినిమా కేరాఫ్ అడ్రస్‌గా నిలువడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది


English summary
Collection of Rs 100 crore at box office is the current benchmark of success for Bollywood films, but industry professionals think the envelope could be pushed further to Rs 1,000 crore. There is a expectation that Baahubali to Join Magin Figure of Rs. 1000 Crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu