»   » అదీ తమన్నా 'తడాఖా' (హాట్ గా రెచ్చిపోయిన ఫోటోలు)

అదీ తమన్నా 'తడాఖా' (హాట్ గా రెచ్చిపోయిన ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగ చైతన్య-తమన్నా కలిసి ఉన్న 'తడాఖా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్స్ లో తమన్నా చూసిన వారు, ఇన్ సైడ్ సినిమా గురించి తెలిసిన వారు తమన్నా ఈ చిత్రంలో తన అందాలు ఓ రేంజిలో ఆరబోసి తన తడాఖా ఏంటో చూపించింది అంటున్నారు.

నాగచైతన్య, సునీల్ హీరోలుగా మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సమర్పణలో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'తడాఖా' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లంకొండ గణేశ్‌బాబు మాట్లాడుతూ ' చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 24న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. మే లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.

తమన్నా, ఆండ్రియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి కథ: లింగుస్వామి, మాటలు: వేమారెడ్డి, స్క్రీన్‌ప్లే: దీనక్‌రాజ్, సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మైనేని ప్రసాద్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిశోర్ పార్థాసాని (డాలి).

తమన్నా ఉందంటే ఈ మధ్యన అందాల ఆరబోతకు అడ్డం లేదనిపిస్తోంది.

నాగచైతన్య, సునీల్ మీదకన్నా దర్శకుడు ఎక్కువగా తమన్నా మీదే కాన్సర్టేట్ చేసారంటున్నారు

తమన్నా కు నాగచైతన్యతో రెండో సారి చేయటం కలిసి వస్తుందనే నమ్మకం అందరిలో ఉంది.

గతంలో ఇదే దర్శకుడు చేసిన కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంలోనూ తమన్నానే హీరోయిన్

సునీల్ భయస్తుడుగా ఈ చిత్రంలో నవ్వులు పండించాడంటన్నారు.

గతంలో పలు చిత్రాల్లో వానపాటల్లో సెక్సీగా అందాలు ఆరబోసిన తమన్నా ‘తడాఖా' సినిమాలో కూడా వాన పాటలో నటించబోతోంది.

తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో ‘వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్‌గా ‘తడాఖా' చిత్రం రూపొందుతోంది.

పూర్తి స్దాయి వినోదాత్మక చిత్రం కావటంతో కమర్షియల్ గా తమన్నా అందచందాలు సినిమాకు ప్లస్ అవుతాయంటున్నారు.

ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు.

సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా గతంలో రచ్చ, ఆవారా చిత్రంలో వానపాటల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది.

తడాఖా చిత్రంలో కూడా తమన్నా అదే రేంజిలో రెచ్చిపోతుండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు.

తమన్నా ..నాగచైతన్యకు పెయిర్ గా చేయటం బిజినెస్ పరంగానూ కలిసి వచ్చే అంశం

నాగచైతన్య వరస ప్లాపుల్లో ఉండంటంతో ఈ సినిమాపై ఆయనకు చాలా అంచనాలు ఉన్నాయి.

నాగ చైతన్య-తమన్నా కలిసి ఉన్న ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై,మంచి క్రేజ్ తెచ్చుకుంది.

English summary

 Naga Chaitanya's upcoming flick Tadakha first look poster released. The movie is a remake of Tamil hit Vettai starring Arya, Madhavan, Amala Paul and Sameera Reddy in lead.
Please Wait while comments are loading...