మీ బిడ్డకు అతడి పేరు పెడతారా? సమంతపై అభిమానుల ప్రశ్నలు!
పెళ్లి బిజీలోనూ సమంత అభిమానులతో ముచ్చటించింది. ట్విట్టర్ ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
Recommended Video

అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత మరికొన్ని గంటల్లో సాంప్రదాయ బద్దంగా భార్య భర్తలు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లి వేడుక జరుగుతుందనగా సమంత అభిమానులతో ట్విట్టర్లో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా కొందరు అభిమానులు సమంతకు ఊహించని ప్రశ్నలు వేశారు. వాటికి సమంత ఓపికగా సమాధానం చెప్పింది. నాగ చైతన్యతో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ఈ సందర్భంగా సమంత స్పష్టం చేసింది.

పెళ్లి అయినట్లు మార్పింగ్ ఫోటో....
శుక్కవారం రాత్రి సమంత, నాగ చైతన్య పెళ్లి జరుగబోతోంది. అయితే సమంతతో చిట్ చాట్ చేసిన ఓ అభిమాని వారి పెళ్లి జగినట్లు ఓ మార్పింగ్ ఫోటో పోస్టు చేశారు. దీనికి సమంత స్పందిస్తూ చాలా క్యూట్ గా ఉంది అంటూ మురిసిపోయింది.

చైతు ఏమైనా ట్రబుల్ ఇస్తే చెప్పండి మేం చూసుకుంటాం...
‘పెళ్లయ్యాక నాగ చైతన్య నిన్ను ఏమయినా ఇబ్బంది పెడితే చెప్పు సమంతా.. మన సామ్ ఆర్మీ వచ్చేస్తుంది' అని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సమంత 'సో క్యూట్' అని రిప్లై ఇచ్చింది.

పెన్సిల్ స్కెచ్ వావ్
ఓ అభిమాని పెన్సిల్‌తో వేసిన నాగచైతన్య, సమంత చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 'వావ్ థ్యాంక్యూ' అని సమంత పేర్కొంది.

ఎప్పటికీ తప్పుకోను
పెళ్లి తర్వాత మీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు అనే ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.... తాను సినిమాల నుండి ఎప్పటికీ తప్పుకోను అని తేల్చి చెప్పింది.

గౌతమ్ మీనన్ పేరు పెడతారా?
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తొలిసినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే'. ‘మీకు పుట్టబోయే బిడ్డకు గౌతమ్ మీనన్ అని పేరు పెడతారా?' అని ఓ అభిమాని అడిగాడు.. దానికి సమంత లాల్ అంటూ రిప్లై ఇచ్చింది.

పెళ్లి ముహూర్తం
సమంత, నాగ చైతన్య వివాహానికి అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అంతకుంటే ముందు మధ్యాహ్నం 3 గంటలకు నుండి సాయంత్రం 6 గంటల వరకు మెహందీ వేడుక జరుగనుందని సమాచారం.

క్రిస్టియన్ వెడ్డింగ్ టైమ్
హిందూ సాంప్రదాయంలో పెళ్లి పూర్తయిన తర్వాత అక్టోబర్ 7వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్య క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరుగనుంది.

ప్రత్యేక దుస్తులు
హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహ వేడుకలో నాగ చైతన్య గ్రాండ్ మదర్ డి రాజేశ్వరి చీరను సమంత ధరించనుంది. దీంతో పాటు ఆమెకు సంబంధించిన బంగారు నగలను సమంత ధరించనుంది. నాగ చైతన్య ట్రెడిషనల్ ధోతీ ధరిస్తారు. క్రిస్టియన్ వెడ్డింగులో సమంత క్రేష్నా బజాజ్ డిజైన్ చేసిన దుస్తులు ధరించనుంది. చైతు 3 పీస్ సూట్ ధరిస్తారు.

పరిమిత సంఖ్యలో గెస్టులు
ఈ వివాహ వేడుకకు కొద్ది సంఖ్యలో మాత్రమే గెస్టులు హాజరు కాబోతున్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సమంత ఫ్యామిలీ హాజరు కానుంది. చైతూ చిన్ననాటి ఫ్రెండ్స్ రామ్ చరణ్, మరికొందరు ఈ వేడుకకు హాజరవుతారు. పెళ్లి వేడేక తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. త్వరలో డేట్ ప్రకటించనున్నారు.

హనీమూన్
పెళ్లి తర్వాత తమ సినిమా షూటింగుల్లో బిజీ కాబోతున్న నాగ చైతన్య, సమంత క్రిస్ మస్ సీజన్లో యూఎస్ఏకు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications










