Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూలో రూ. 5 కోట్ల సెటిల్మెంట్ ప్రయత్నం, పవన్‌ను తిట్టడం వెనక అతడే....!
Recommended Video
కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు కొడుకు అభిరామ్ ఫోటోలు లీక్ చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 'మా' ఆఫీసు ముందు బట్టలు విప్పి అర్దనగ్న ప్రదర్శన, ఆమెపై ఇండస్ట్రీ బ్యాన్ విధించడం లాంటి సంఘటనత తర్వాత అభిరామ్ ఫోటోలు లీక్ చేయడంతో ఇండస్ట్రీలో వణుకు మొదలైంది. ఈ చర్యతో 'కాస్టింగ్ కౌచ్' ఆందోళన మరింత వేడెక్కింది. ఆ తర్వాత ఈ గొడవ అనేక మలుపులు తిరిగి చివరకు పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి బూతులు తిట్టడం, ఆమెపై పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురు దాడి చేయడం తెలిసిందే. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన విషయం బయట పెట్టారు.
అభిరామ్ విషయంలో రూ. 5 కోట్ల సెటిల్మెంట్ ప్రయత్నం
తాజాగా ఓ వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన విషయం బయట పెట్టారు. సురేష్ బాబు కొడుకు అభిరామ్, శ్రీరెడ్డి వివాదాన్ని డబ్బుతో సెటిల్మెంట్ చేయడానికి తానే స్వయంగా ప్రయత్నం చేసినట్లు వర్మ చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రయత్నం ఎందుకు చేశాననే విషయం కూడా వర్మ వెల్లడించారు.
సురేష్ బాబు నాకు క్లియర్‌గా చెప్పారు
సురేష్ బాబు నాకు చాలా కాలంగా తెలుసు, పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడినపుడు ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. నా కొడుకు నిజంగా తప్పు చేస్తే అతడికి చట్టప్రకారం శిక్ష పడుతుంది. అమాయకుడు అయితే ఆటోమేటిక్ గా బయటకు వస్తాడు. ఈ విషయంలో నేను ఏమీ చేయాలనుకోవడం లేదు.... అని తనతో, చాలా మందితో క్లియర్ గా చెప్పినట్లు వర్మ వెల్లడించారు.
జరుగకూడనిది జరిగితే రామానాయుడు లాంటి సంస్థపై మచ్చ
నా ఆలోచన ఏమిటంటే చట్టాలు అనేవి మహిళలకు చాలా సపోర్టుగా ఉంటాయి. సురేష్ ఏదో ప్రిన్సిపుల్స్ అంటూ మాట్లాడుతున్నాడు. ఎంత చెడ్డా అతడు కొడుకు. వాళ్ల ఫ్యామిలీ ప్రెస్టీజ్ విషయం ఇది. అంత పెద్ద రామానాయుడు గారి సంస్థ ఉంది. అలాంటి దాని మీద ఇలాంటి మచ్చ వచ్చి రేపు పొద్దున్న ఏదైనా జరుగ కూడనిది జరిగితే ఏంటి అనేది నా మైండ్‌లో ఎక్కడో స్ట్రాంగ్ గా అనిపించింది... అందుకే ఈ మ్యాటర్‌ను డబ్బుతో సెటిల్ చేద్దామనే ఆలోచన తనకు వచ్చిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
శ్రీరెడ్డికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాను
నా మనసులో నేను అనుకుంటున్న విషయాన్ని శ్రీరెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. నువ్వు ఏది సాధించాలనుకున్నావో అది అయిపోయింది. కానీ నువ్వు క్రమినల్ కేసులు పెట్టి వారిని బయటకు లాగి కోర్టుకు ఈడ్చడం వల్ల నీకు ఎక్స్ట్రాగా వచ్చే లాభం ఏమిటి? నువ్వు ఆల్రెడీ ఎక్స్‌ఫోజ్ చేశావు. ఎంబారెస్మెంట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. దానికి మించి వారిని ఇంకా తిప్పలు పెట్టి ఇవన్నీ చేసి దాని మూలాన కాజ్ (కాస్టింగ్ కౌచ్)కు ఏదీ ఎక్స్ట్రా రాదు. నీకు కూడా ఎక్స్ ట్రా పబ్లిసిటీ రాదు. నేను నీకు గ్యారంటీ ఇవ్వలేను కానీ సురేష్ బాబు ఫ్యామిలీతో మాట్లాడి రూ. 4 నుండి 5 కోట్లు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాను అని శ్రీరెడ్డితో చెప్పినట్లు.... వర్మ తెలిపారు.
వీరిద్దరూ నాకు సంబంధం లేదు
అభిరామ్ విషయంలో నేను ఔటాఫ్ ది వే వెళ్లి సెటిల్మెంట్ చేయను అని సురేష్ బాబు నాకు చెప్పాడు. చాలా మందికి కూడా అదే చెప్పాడు. ఈ విషయంలో నేను ఔట్ సైడ్ పార్టీ. నాకు ఇద్దరితో సంబంధం లేదు. అభిరామ్ నాకు సంబంధం లేదు. శ్రీరెడ్డి నాకు సంబంధం లేదు. కేవలం నాకు వాళ్ల ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను రెండు వైపులా ఆలోచించి రేపు నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉండాలి. నీకు కూడా కెరీర్ కావాలి అని చెప్పి శ్రీరెడ్డిని సెటిల్మెంటుకు ఒప్పించే ప్రయత్నం చేశాను అని వర్మ తెలిపారు.
శ్రీరెడ్డి అలా అనడంతో షాకయ్యాను
ఎన్ని విధాలుగా చూసినా నీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అభిరామ్ ఇష్యూలో నువ్వు కేవలం ఒక వ్యక్తిని శిక్షించడం లేదు. ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షిస్తున్నావ్. వాళ్లందరినీ ఒక టెన్షన్ లోకి తీసుకెళుతున్నావు. అందరి పేర్లు బజారులోకి తీసుకొస్తున్నావు. ఇప్పటికే చాలా చేశావు. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా హార్స్ చేసే బదులు సెటిల్మెంటుకు ఒప్పుకో.... నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ, ఎలాగైనా అభిరామ్ ఇంట్లో వారిని కన్విన్స్ చేసి నాలుగైదు కోట్లు సెటిల్మెంట్ వచ్చేట్లు మాగ్జిమమ్ ట్రై చేస్తాను. ఇలాంటి ఫిగర్ నీకు యాక్సెప్టబుల్ అయితే....నువ్వు ఒకే అంటే వెంటనే మాట్లాడతాను. సురేష్ మాత్రం వెంటనే నో అంటాడని నాకు తెలుసు. కానీ వాళ్ల ఇంట్లో ఫ్యామిలీ అంతా తెలుసు కాబట్టి నేను మాగ్జిమమ్ ట్రై చేస్తాను. సురేష్ వాళ్ల ఫ్యామిలీ బదనాం అవ్వకూడదని నాకు ఒక ఇంటెన్షన్ ఉంది. అంత డబ్బు నీకు వచ్చి నీ లైఫ్ బావుంటుంది....అని శ్రీరెడ్డికి ఎంత చెప్పినా ఆమె అందుకు ఒప్పుకోలేదు. అంత డబ్బును కాదనడంతో నేను స్టన్ అయ్యాను. 5 కోట్లు ఆఫర్ ఇస్తే శ్రీరెడ్డి పొజిషన్లో ఉన్న ఎవరైనా నో చెప్పరు. కానీ ఆమె నో చెప్పడంతో పెద్ద షాక్ అయ్యాను.... అని వర్మ తెలిపారు.
శ్రీరెడ్డి నాకు ఒకటే చెప్పింది, ఏడ్చింది
తాను సెటిల్మెంట్ చేస్తానన్న డబ్బు కాదనడంతో పాటు.... నేను కాస్టింగ్ కౌచ్ పెయిన్ పీలవుతున్నాను. నేను చేసే ఫైట్ ఇండస్ట్రీకి వచ్చే ఇతర అమ్మాయిలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నాను. నా జీవితం మొత్తం ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ విషయంలో నేను ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే అద్దంలో నా మొహం నేను చూసుకోలేను అని చెప్పి శ్రీరెడ్డి ఏడ్చింది.... అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
శ్రీరెడ్డి బట్టలిప్పడం వల్లనే కాస్టింగ్ కౌచ్ బలంగా....
ఆమె అలా అన్న తర్వాత మరింత షార్ప్ ఫోకస్ ఆమెపై నాకు వచ్చింది. ఆ అమ్మాయి కన్విక్షన్, డిటర్మినేషన్ మరింత ఇంప్రెస్ చేసింది. స్ట్రిప్ చేయడం తప్పు అని కొందరు అంటున్నారు. అలాంటి ఎక్స్ ట్రీమ్ పనులు చేసినపుడే ఎవరైనా ఫోకస్ లోకి వస్తారు. అసలు ఏం జరుగుతోంది, ఏమిటి విషయం అని వినే ప్రయత్నం చేస్తారు. దీని వల్లే జాతీయ, అంతర్జాతీయ మీడియా ఫోకస్ శ్రీరెడ్డి మీద పడింది. కత్తి మహేష్ కూడా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌ను అనడం వల్లనే ఫోకస్ లోకి వచ్చాడు. నువ్వు కూడా అలాంటి పంథా కొనసాగించాలని శ్రీరెడ్డికి సూచించాను....అని వర్మ తెలిపారు.
నేను చెప్పిన మాటల ప్రభావంతోనే పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి అలా తిట్టింది
నేను చెప్పిన మాటల ప్రభావంతోనే పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి అలా ప్రవర్తించింది. నా ప్రభావంతోనే అలా తిట్టింది. అది ఆ అమ్మాయి ఐడియా కాదు. ఈ విషయంలో ఎవరికైనా అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంటే అది నేను. నేను ఆ మాట అనక పోయినా నా మూలాన శ్రీరెడ్డి ఇన్ ఫ్యూయెన్స్ అయింది కాబట్టి అలా ప్రవర్తించింది... అని వర్మ తెలిపారు.
వర్మ ఆ రెండు విషయాలు మరోసారి స్పష్టంగా
తన వీడియోలో చివరగా రెండు విషయాలు వర్మ మరోసారి స్పష్టంగా చెప్పారు. ‘నేను సురేష్ బాబుకు తెలియకుండా కేవలం ఆ అమ్మాయికి, సురేష్‌కి, వాళ్ల ఫ్యామిలీకి సహాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో శ్రీరెడ్డితో అలా మాట్లాడినపుడు ఆమె 5 కోట్లు తిరస్కరించింది. ఆది వాస్తవం. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ ను అలా అనిపించేలా ఇన్ఫ్లూయెన్స్ చేసింది నేను. అది ఆ అమ్మాయి ఐడియా కాదు' అని వర్మ తెలిపారు.