Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
ఇదే నా మొదటి ఎక్స్ పీరియన్స్.....!?
'బొమ్మరిల్లు'లో హాసినిగా వీలైతేనాలుగు మాటలు కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ అఖిలాంధ్ర ప్రేక్షకుల గుండెల్లో గూడు సంపాదించుకున్న క్యూట్‌గాళ్ జెనీలియా. ఏడేళ్ళ తెలుగు సినీ కెరీర్లో ఎప్పుడూ పూర్తి స్క్రిప్ట్ తో వచ్చిన దర్శకులని, నిర్మాతలనీ చూడలేదు. మొదటి సారిగా బౌండెడ్ స్క్రిప్ట్ ని చూసి చేసిన సినిమా కథ. ఇలాంటి అనుభవం ఇంతకుమున్నెన్నడూ జరగలేదు. చాలా హ్యాపీగా ఉంది అంటూ జెనీలియా తన రాబోయో చిత్రం కథ గురించి మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రంలో నేను చేసిన చైత్ర లాంటి అమ్మాయినీ నేను ఎప్పుడూ కలవలేదు అంటూ మెచ్చుకుంటోంది. అంతేగాక ఈ చిత్రం నిర్మాత గుణ్ణం గంగరాజు ప్రొపిషినలిజం, కమిట్ మెంట్ చాలా ఆశ్చర్యపరిచిందంటోంది. ఈరోజు డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ఆమెకు మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జెనీలియా తాను పోషించబోయే పాత్ర గురించి చెబుతూ నాది 'చైత్ర' అనే స్కూల్ టీచర్ పాత్ర. స్కూల్ టీచర్ అనగానే కేవలం పిల్లలకు పాఠాలు చెప్పే పంతులమ్మనే కాదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించే అవకాశం కూడా నాకు ఈ పాత్ర ద్వారా దక్కినందుకు ఆనందంగా వుంది. చాలెంజింగ్ గా ఫీలయ్యి చేసిన ఈ పాత్ర రాబోయే 15 సంవత్సరాల వరకు నేను చాలా గర్వంగా చెప్పుకునే విధంగా వుంటుంది అంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఆమె ఓ రొమాంటిక్ ధ్రిల్లర్ గా వర్ణిస్తోంది.