వాళ్లు కూడా అప్రిషియేట్ చేసారు, రాజమౌళి ఫుల్ హ్యాపీ

By Bojja Kumar

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' ఇండియాలో ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రం ఇండియా బోర్డర్ దాటి ఇతర దేశాల ప్రేక్షకులను సైతం అమితంగా అలరిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం సౌత్ కొరియాలో జరిగిన బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు.

కొరియన్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఇక్కడ ఈ సినిమాకు రెస్పాన్స్ బాగా రావడంతో రాజహౌళి ఆనందం వ్యక్తం చేసాడు. తన ఫీలింగ్స్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అంతర్జాతీయంగా ఈ సినిమాను గుర్తింపు రావడంపై రాజమౌళి ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

It was a nice feeling: Rajamouli

‘మనం మాట్లాడే బాష తెలియని వారు... మన పనితీరును మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నైస్ ఫీలింగ్' అంటూ రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా చూసిన చాలా మంది సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అడుగుతున్నారని రాజమౌళి తెలిపారు.

చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ....స్క్రీనింగుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని కొరియా బాషలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X