హీరోయిన్ భర్త పెళ్లి వివాదం: ప్రేమించలేదని వివరణ

By Bojja Kumar

హైదరాబాద్: మాజీ తెలుగు హీరోయిన్ సరిత భర్త, మళయాల నటుడు ముఖేష్ విడాకులు ఇవ్వకుండానే మిథిలీ దేవికా అనే డాన్సర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడంపై సరిత కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

ముఖేష్, మిథిలీ దేవికా....ముఖేష్ నివాసంలో తొలుత రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత త్రుపునితరా రిజిస్టర్ ఆఫీసులో అఫీషియల్‌గా రిజిస్టర్ చేయించుకున్నారు. మొత్తానికి వీరి పెళ్లి విషయం బయటకు లీకైంది. రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో వీరిది లవ్ మ్యారేజ్ అని మీడియాలో ప్రచారం జరిగింది.

Methil Devika

ముఖేష్, మిథిలీ దేవికా సంగీత నాటక అకాడమీలో మెంబర్స్. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ప్రేమలో పడ్డారని పుకార్లు చెలరేగాయి. కానీ....తమది ప్రేమ వివాహం కాదని వాదిస్తోంది మిథిలీ దేవికా. పెద్దలు కుదర్చిన అరేంజ్డ్ మ్యారేజే అని చెబుతోంది.

'మాది ప్రేమ వివాహం కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అరేంజ్ చేయబడ్డ మ్యారేజ్. ముఖేష్ తొలుత పెళ్లి ప్రపోజ్ చేసాడు. మొదట నేను ఒప్పుకోలేదు. ముఖేష్ సోదరి సంధ్య, ఆమె భర్త రాజేంద్రన్ సంప్రదించాక ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. పెద్దలు జాతకాలు పరిశీలించిన తర్వాత పెళ్లికి ఒకే చేసారు. ఆ తర్వాత ఇద్దరి దగ్గరయ్యాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం' అని మిథిలీ దేవిక వెల్లడించారు.

'సంగీత నాటక అకాడమీకి ముఖేష్ హెడ్, తాను జనరల్ కౌన్సిలర్, కానీ మేము ఎప్పుడూ అంత సన్నిహితంగా మాట్లాడుకునేవారము కాదు' అని మిథిలీ దేవికా వెల్లడించారు. కాగా....ముఖేష్ మొదటి భార్య సరిత . తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడంపై సరిత కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X