ప్రభాస్ ‘మిర్చి’: సెక్సీ సాంగ్ కాదంటున్న హంస!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' మూవీలో హీరోయిన్ హంసా నందిని ప్రత్యేక సాంగులో కనిపించనుంది. అయితే ఇది ఐటం సాంగు అని ప్రచారం సాగడంపై హంసా నందిని మండి పడుతోంది. ఇందులో తాను చేసిన సాంగు సెక్సీగా ఉండదని, వైల్డ్ వేలో సాగుతుందని, అందుకే దీన్ని ఐటం సాంగ్ అనడం సబబు కాదని అంటోంది.
'ఈ పాటను తాను ఎంతో కష్టపడి చేసాను, ఎండిపోయిన ఎర్రటి మిరపకాల మధ్యలో ఈ సాంగ్ చిత్రీకరించారు. నేను తప్ప సెట్స్ లో అంతా ముఖానికి మాస్క్ వేసుకున్నారు. ఆ సాంగ్ చిత్రీకరించినంత సేపు నాకు అగ్ని పరీక్షలా అనిపించింది. డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఈ పాటకోసం 20 మంది కేరళ డాన్సర్స్‌ను రప్పించారు, ఈ సాంగ్ పూర్తిగా వైల్డ్ వేలో సాగుతుంది సెక్సీ వే కానే కాదు' అని హంసానందిని చెప్పింది.
కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











