»   » ‘రభస’ కాదని తేల్చి చెప్పిన సమంత

‘రభస’ కాదని తేల్చి చెప్పిన సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి 'రభస' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రభస' టైటిల్ ఫైనల్ కాదని....త్వరలోనే అసలు టైటిల్ ప్రకటిస్తారని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సినిమా షూటింగ్ ఈ రోజే మొదలైన విషయం కూడా సమంత వెల్లడించారు. కాగా....ఈ చిత్రానికి మొదట అనూప్ రూబెన్స్‌ని సంగీత దర్శకుడుగా అనుకున్నారు. కానీ అతన్ని తొలగించి తమన్‌ను తీసుకున్నట్లు సమాచారం. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ట్యూన్స్ నచ్చక పోవడంతో పాటు దర్శకుడితో అనూప్ రూబెన్స్‌కు విబేధాలే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మళయాలం హీరోయిన్ నజ్రియాను సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
"First day of Vasu-ntr film.... It will not be titled rabhasa" samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu