తెరకెక్కుతోన్న నీరా రాడియా నిజ జీవితం...డిటేల్స్
మీడియాలో ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ గా మారిన '2 జి స్పెక్ట్రమ్" కుంభకోణం, అందులో ప్రధాన నిందితురాలు నీరా రాడియా లపై ఓ చిత్రం త్వరలో నిర్మాణం కానుంది. ఒక సాధారణ మహిళ అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికవ్యవస్థనే సవాల్ చేసే స్ధాయికి ఎదగటం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను సైతం తన చుట్టూ తిప్పుకోవటం వంటి అంశాలు ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే అవినీతిని పెంచిపోషించడంలో ప్రభుత్వ అధికారులను, బ్యాంకు అధికారులనేగాక పారిశ్రామికవేత్తలందరినీ తన కనుసన్నలతో ఏరకంగా అదుపులో పెట్టుకుంది వంటి ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తూ.. కథను, స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు.
ఇక నీరా పాత్రను చేయటానికి ఇప్పటిదాకా ఒక్క హిట్టూ లేని పూనమ్ జావర్ ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. 1994లో అక్షయ్‌కుమార్‌తో 'మొహ్రా" చిత్రంలో నటించిన పూనమ్ జావర్ ఈ చిత్రానికిగాను శృంగార పాత్ర పోషించేందుకు...హాట్‌హాట్‌గా నటించేందుకు ముందుకు వచ్చింది. నీరా రాడియా పర్సనాలిటీకి పూనమ్‌జావర్ అయితే సరిగ్గా సరిపోతుందని నిర్మాతలు తనని ఎంపికచేశారని మీడియాకు ఆనందంగా చెబుతోంది పూనమ్. ఈ చిత్రాన్ని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ సంస్థ నిర్మించనుంది. సచ్చిత్ పురాణిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











