Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గిన్నీస్ బుక్ కి ఎక్కుతున్న హాట్ ఐటం గర్ల్
ముంబై: ఇంతకాలం భారతీయ దర్శకులు,నిర్మాతలు మాత్రమే గిన్నీస్ బుక్ ఎక్కగలిగారు. అయితే త్వరలో ఐటం సాంగ్ లతో గిన్నీస్ కి బుక్ కి ఎక్కబోతోంది ఓ ఐటం బాంబ్. భోజపురికి చెందిన సీమా సింగ్ త్వరలో గిన్నీస్ వరల్డ్ రికార్డులలో చోటు చేసుకోనుంది. ఆమె ఇప్పటివరకూ రెండు వందల యాభైకి పైగా ఐటం సాంగ్ లు చేసింది. దాంతో ఇప్పటివరకూ ప్రపచంలో అన్ని ఐటం సాంగ్ లలో చేయలేదని,గిన్నీస్ రికార్డుకి పంపుతున్నామని చెప్తున్నారు.
భోజపురి చిత్రాలతో సీమా సింగ్ ది ప్రత్యేక స్ధానం. ఆమె ఐటం సాంగ్ ఉందంటే నిర్మాతలు తమ సినిమా సగం హిట్టే అని భావిస్తారు. దాంతో ఆమె అక్కడ పూర్తిగా ఐటం గర్ల్ గా సెటిలైపోయింది. ఆమె తను ఐటం సాంగ్ వీడియోలన్నిటినీ సేకరించే పనిలో ఉంది.వాటిని అన్నిటినీ కలిపి గిన్నీస్ వారికి పంపుతున్నారు. ఆమె తరుపున ఓ టీమ్ ఇప్పటికే ఆ సినిమాలు నుంచి ఆ సాంగ్స్ కట్ చేసే పనిలో పడిపోయింది. అయితే కొన్ని చిత్రాలు సిడీలు లభ్యంకాకపోవటంతో వాటి నిర్మాతలను ఆమె సంప్రదిస్తోంది.
ఇక ఇలా సీమా గిన్నీస్ బుక్ లోకి ఎక్కటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భోజపురి పరిశ్రమ అయితే చాలా ఆనందపడుతోంది. తమ పరిశ్రమ ఏ విషయంలోనూ తీసిపోదని ప్రపంచానికి తెలియచేసినట్లవుతుందని అంటోంది. భోజపురి చిత్రాలకు ప్రత్యేకమైన మార్కెట్ ముంబై వంటి మహానగరాల్లో ఉంది. ఆ సినిమాల కోసం పెద్ద స్టార్స్ నటించిన హిందీ సినిమాలను సైతం ప్రక్కన పెట్టి జనం వెళ్లి చూస్తూంటారు. అలా భోజపురి ప్రేక్షకులందరికీ ఆమె సుపరిచితమే.