'ఆకలేస్తే అన్నంపెడతా' పాట కి సంభంధమున్న వారి కెరీర్లు విచిత్రంగా మలుపుతిరుగుతున్నాయి.ముందుగా హస్కీగా పాడి యూత్ ని ఒక ఊపు ఊపిన గాయని మమతా మోహన్ దాస్ పూర్తి స్థాయి దశ తిరిగి నటిగా బిజీ అయిపోయింది.అలాగే ఆ ఐటమ్ సాంగ్ లో నర్తించిన యానా గుప్తా రివర్స్ లో గాయనిగా బిజీ అవ్వబోతోంది. బిగ్ మ్యూజిక్, హోమ్ వీడియో సంయుక్తంగా విడుదల చేసిన ' బ్యాక్ ఉన్దా దా ఇన్‌ఫ్లుయెన్స్' అనే పంజాబీ పాప్ ఆల్బమ్‌లో ఆమె రెండు పాటలు పాడింది. మరో విశేషమేమంటే ఈ పాటల్ని రాసిందే కూడా ఆమే.పంజాబీ సంగీతకారుడు డాక్టర్ జియస్ సంగీతం సమకూర్చిన ఈ ఆల్బమ్ లోని 'ఆగ్ కా దరియా', 'నా కోయీ ఖయాల్' అంటూ సాగే ఈ రెండు పాటలూ ఇప్పుడు మార్కట్ లో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. దాంతో గాయనిగా అవతారమెత్తిన ఈ ఐటమ్ గర్ల్ కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయిట. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా హీరోగా తెలుగు తెరను పలకరించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. ఇది నిజమైతే ఈ పాటకి సంబంధం ఉన్న వాళ్ళు ఇతర విభాగాలలో కూడా ప్రయత్నిస్తున్నారు.. రాణిస్తున్నారు. ఇలా అయితే అందరి కంటే ముందు మెగాస్టార్ పాలటిక్స్ లోకి వచ్చే వార్తను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు ఆయన అభిమానులు ఉత్సాహంగా. కరక్టే కావచ్చు.